రాజ్ కి జాక్‌పాట్‌ .. డబ్బు కష్టాలు పంచుకున్న ఇంటిసభ్యులు.. `బిగ్‌ బాస్‌` విన్నింగ్‌ మనీ ఎందుకంటే?

By Aithagoni Raju  |  First Published Nov 16, 2022, 12:03 AM IST

పదకొండో వారానికి కెప్టెన్‌ ఫైమా తప్ప మిగిలిన అంతా నామినేట్‌ అయ్యారు. అయితే వారిలో ఒకరు నామినేషన్ల నుంచి సేవ్‌ అయ్యే అవకాశం ఇచ్చాడు. అందుకోసం పెద్ద ట్విస్ట్ పెట్టాడు బిగ్‌ బాస్‌. 


బిగ్‌ బాస్‌ 6 తెలుగు రియాలిటీషో పదకొండే వారంలోకి అడుగుపెట్టింది. ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. తాజాగా బిగ్‌ బాస్‌ బిగ్‌ ట్విస్ట్ ఇచ్చారు. బిగ్ బాస్‌ టైటిల్‌ విన్నింగ్‌ మనీకే ఎసరు పెట్టారు. నామినేషన్ లో ఉన్న వారిని ఆడుకుంటున్నాడు. పదకొండో వారానికి కెప్టెన్‌ ఫైమా తప్ప మిగిలిన అంతా నామినేట్‌ అయ్యారు. అయితే వారిలో ఒకరు నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యే అవకాశం ఇచ్చాడు. అందుకోసం పెద్ద ట్విస్ట్ పెట్టాడు బిగ్‌ బాస్‌. 

నామినేషన్లలో ఉన్న సభ్యులకు చెక్కులిస్తూ, ఒక లక్ష నుంచి, ఐదు లక్షల వరకు చెక్‌పై రాయాలని, ఎక్కువ వేసిన వారి ఇమ్మూనిటీ పొందుతారని, వాళ్లు ఈ వారం నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారని తెలిపారు. ఇందులో శ్రీ సత్య, కీర్తి, రేవంత్‌ ఒక్కరూపాయి తక్కువ ఐదు లక్షలు రాశారు. అయితే శ్రీహాన్‌తో తన శారీ ధర చెబుతూ, తాను రాసిన అమౌంట్‌ దగ్గరగా ఉండే ధర చెప్పింది. దీంతో ఆమెని డిస్‌ క్వాలిఫై చేశారు బిగ్‌ బాస్‌. 

Latest Videos

undefined

రేవంత్‌, కీర్తిలు రాసిన అమౌంట్‌ సేమ్‌ ఉండటంలో ఒకే అమౌంట్‌ని ఇద్దరు రాస్తే కన్సిడర్‌ చేయమని, అంతకంటే తక్కువ రాసిన వాళ్లని కన్సిడర్‌ చేస్తామన్నారు. ఆ తర్వాత తక్కువ అమౌంట్‌ని ఇనయ, మెరీనాలు రాశారు. వాళ్లు రెండు రూపాయలు తక్కువ రాశారు. ఇద్దరు రాయడంతో వీరిది కూడా చెల్లదు. ఆ తర్వాత అత్యధిక అమౌంట్‌ రాసిన రాజ్‌ విన్నర్‌ అయ్యారు. ఆయన నాలుగు లక్షల 99వేల 700 రూపాయలు రాశారు. దీంతో విన్నర్‌గా నిలిచారు. ఈ వారం ఇమ్యూనిటీ పొంది నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యారు. 

విన్నింగ్‌ అమైంట్‌ యాభై లక్షల నుంచి ఐదు లక్షలు లాస్‌ ఏర్పడబోతుంది. వాటిని కాపాడుకునేందుకు మరో టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. రన్నింగ్ రేస్‌ పెట్టాడు. ఇందులో క్రికెట్‌ గ్రీస్‌లో నిర్ణీత టైమ్‌లో వంద పరుగులు చేయాల్సి ఉందగా, రేవంత్‌, రోహిత్ వికెట్ల మధ్య పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. టైమ్‌కి చేయలేకపోయారు. దీంతో రేస్‌నుంచి తప్పుకున్నారు. మరో లక్ష లాస్‌ ఏర్పడింది. 

అనంతరం డబ్బు ప్రాధాన్యత, అవసరాలు చెప్పాలని, బిగ్‌ బాస్‌ ప్రైజ్‌మనీతో ఏం చేస్తారనే విషయాన్ని తెలియజేయాలని చెప్పగా, ఫైమా మొదటగా వచ్చి తన ఎమోషన్స్ ని పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాము డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. మనీ కోసం పత్తి ఏరడానికి కూడా పోయనని వచ్చిన మనీని కూరగాయాలు కొనడం కోసం ఉపయోగించమని తెలిపింది.  అయితే హైదరాబాద్‌కి వచ్చాక చాలా రోజులు కిరాయి ఇంట్లో ఉన్నామని, సొంతిళ్లు లేదని, దీంతో చాలా మంది అవమానించారని, తాము రెంట్‌ కట్టలేని పరిస్థితుల్లో ఉండటంతో ఓ హోనర్‌ తమని బయటకు పంపించే ప్లాన్‌ చేసింది పేర్కొంది. సొంతిళ్లు కట్టి అమ్మకి గిప్ట్ గా ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది. 

మరోవైపు ఆదిరెడ్డి చెబుతూ, తనకు సొంతిళ్లు లేదని బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచే ప్రైజ్‌ మనీతో తన భార్యకి ఇళ్లు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నారట. అయితే నాన్న పనిచేసే వాడు కాదని, అమ్మ పని చేసేదని, తాము సంపాదించుకుని ఇంటిని పోషించే వాళ్లమని తెలిపాడు. కానీ అలా లేదని, అందుకే ఈప్రైజ్‌ మనీ గెలవాలనుకుంటున్నట్టు చెప్పాడు  ఆదిరెడ్డి. శ్రీ సత్య చెబుతూ, తాము చిన్నప్పట్నుంచి గోల్డెన్‌ స్ఫూన్‌లో పెరిగానని, కష్టం ఏంటో తెలయదని, కానీ అమ్మానాన్న అనారోగ్యం పెద్ద సమస్యగా మారిందని, అమ్మ హెల్త్ కోసం ఈ డబ్బు కావాలని పేర్కొంది శ్రీ సత్య. కీర్తి చెబుతూ, తాను ఎంతో ఒంటరిగా పెరిగానని, తనలాంటి వారికోసం సహాయం చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. ఆర్ఫన్‌ ఏజ్‌  నెలకొల్పి అనాథలకు ఫుడ్‌ పెట్టాలనుకుంటున్నట్టు తెలిపింది.సోషల్‌ సర్వీస్‌ చేయాలనుకుంటున్నట్టు తెలిపింది కీర్తి. మిగిలిన వారివి రేపు కొనసాగనున్నాయి. 

మరోవైపు అంతకు ముందు కీర్తి, శ్రీ సత్య మధ్య నామినేషన్ల గొడవజరిగింది. వాదించుకున్నారు. అయితే కీర్తిని శ్రీసత్య బాడీ లాంగ్వేజ్‌ని షేక్‌ చేస్తూ ఎగతాళి చేసినట్టుగా పోజులివ్వడంతో కీర్తి మండిపడ్డింది. కాసేపు ఇద్దరి మధ్య గట్టిగా గొడవ జరిగింది. ఇనయ విషయంలో రాజ్‌, ఫైమా కామెంట్లు చేసుకున్నారు. కాసేపు ఆ ప్రక్రియ హీటెక్కిపోయింది. 

click me!