లారెన్స్ ఓకే చెప్తే ,క్రేజీ కాంబినేషనే

Surya Prakash   | Asianet News
Published : Mar 08, 2021, 06:52 PM IST
లారెన్స్ ఓకే చెప్తే ,క్రేజీ కాంబినేషనే

సారాంశం

డాన్స్ డైరక్టర్ గా తనదైన ముద్రవేసిన రాఘవ లారెన్స్  ఆ తర్వాత టర్న్ తీసుకుని డైరక్టర్ గానూ, హీరోగానూ రాణిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన విలన్ అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. 

డాన్స్ డైరక్టర్ గా తనదైన ముద్రవేసిన రాఘవ లారెన్స్  ఆ తర్వాత టర్న్ తీసుకుని డైరక్టర్ గానూ, హీరోగానూ రాణిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన విలన్ అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయని కోలివుడ్ వర్గాల సమాచారం. అయితే లారెన్స్ ఒప్పుకుందామా వద్దా అనే డైలామోలో ఉన్నారట. రీసెంట్ గా రిలీజైన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా చేసి మెప్పించారు. అదే విధంగా లారెన్స్ కూడా మెప్పిస్తాడని నమ్మి ఆయన్ను ఎప్రోచ్ అవుతున్నారట. 

ఇక రాఘవ లారెన్స్ చాలా ఏళ్లుగా తాను దర్శకత్వం వహించే ‘కాంఛన’ సిరీస్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. ఆయన చేసే క్యారక్టర్స్ చూస్తే నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లు కూడా బాగా చేయగలడని చెప్పచ్చు. అందుకే కమల్ తాజా చిత్రం ‘విక్రమ్’ సినిమాలో విలన్ పాత్రకు అతణ్ని కన్సిడర్ చేసారట లోకేష్.  

ఆల్రెడీ సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజినీతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు లారెన్స్ ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లోపే కమల్ సినిమాలో అతడికి అవకాశం దక్కడం విశేషమే అంటున్నారు.  కమల్-లారెన్స్ మధ్య తెరపై కెమిస్ట్రీ ఎలా పండుతుందో చూడాలనేది అభిమానుల ఆశ. 

ఇక ఈ చిత్రానికి 'విక్రమ్' అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. కమల్ తమ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును ఏప్రిల్ నుంచి నిర్వహిస్తారు. తాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు గొప్ప అభిమానినని లారెన్స్ గర్వంగా చెప్పుకుంటాడు. అలాగే కమల్ అన్నా ఆయనుక ప్రత్యేకమైన అభిమానం!
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..