రాధే శ్యామ్ షూటింగ్ అప్డేట్: ప్రభాస్ తో జాయిన్ అయిన పెదనాన్న!

By team teluguFirst Published Jul 1, 2021, 4:57 PM IST
Highlights

చివరి దశలో ఉన్న రాధే శ్యామ్ చిత్రీకరణ మరో రెండు రోజులలో పూర్తి కానుందట. కాగా నేడు రాధే శ్యామ్ షూటింగ్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పాల్గొన్నారట. ప్రభాస్ తో ఆయన కాంబినేషన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతుంది.

ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ వేదికగా రాధే శ్యామ్ షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. రాధే శ్యామ్ మూవీ కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేయగా అక్కడే షూటింగ్ నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు హీరోయిన్ పూజా హెగ్డే సైతం షూటింగ్ లో పాల్గొన్నారు. ఆమె పార్ట్ పూర్తి కావడంతో విజయ్ బీస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి చెన్నై చెక్కేశారు.


చివరి దశలో ఉన్న రాధే శ్యామ్ చిత్రీకరణ మరో రెండు రోజులలో పూర్తి కానుందట. కాగా నేడు రాధే శ్యామ్ షూటింగ్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పాల్గొన్నారట. ప్రభాస్ తో ఆయన కాంబినేషన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతుంది. అలాగే ప్రభాస్ పై గ్రీన్ మ్యాట్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారట. రాధే శ్యామ్ మూవీలో కృష్ణంరాజు ఓ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. చివర్లో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుందని వినికిడి. 


ఇక గతంలో ప్రభాస్ నటించిన బిల్లా, రెబల్ చిత్రాలలో కృష్ణంరాజు పూర్తి స్థాయి రోల్స్ చేశారు. మళ్ళీ చాలా కాలం తరువాత ప్రభాస్ తో ఆయన స్క్రీన్ పంచుకోనున్నారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. 

click me!