కమల్ 'పుష్పక విమానం' మూకీ, మరి ఈ కొత్త విమానం? స్టోరీ లైన్ ఏంటంటే

By Surya PrakashFirst Published Sep 29, 2021, 7:21 AM IST
Highlights


ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం' రిలీజ్‌కు రెడీ అవుతుంది. నవంబర్‌12న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. దామోదర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘కల్యాణం’పాట సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.


స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ మెల్లి మెల్లిగా సెటిల్ అవుతున్నారు. తొలి చిత్రం ‘దొరసాని’ పెద్దగా ఆడకపోయినా ఆనంద్ కు మంచి గుర్తింపు తెచ్చింది. మంచి నటుడు అనిపించుకున్నాడు. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఫ్యామిలీస్ లోకి వెళ్లాడు. ఆ సినిమాతో కామెడీ టైమింగ్ అందరికీ నచ్చేసింది. ఓటీటీలో విడుదలైనా ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లింది. అన్ని వర్గాలను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఆనంద్ దేవరకొండ  మూడో చిత్రం ‘పుష్పక విమానం’ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దాని విడుదలను నిర్మాతలు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ ‘పుష్పక విమానం’ అన్ని సమస్యలను తొలుగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. దామోదర ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పుష్పక విమానం’మూవీని గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు.

 దర్శకుడు మాట్లాడుతూ, ”ఇందులో ఆనంద్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా నటిస్తున్నాడు. ఈ కథ మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్స్ గా నటించారు” అని అన్నారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘కల్యాణం’పాట సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ గాయకుడు సిద్‌శ్రీరామ్‌, మంగ్లీ పాడారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించారు. ఆనంద్‌కు జోడీగా  గీతా షైనీ నటించింది.  విజయ్‌ దేవరకొండ సమర్పణలో కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, టాంగా ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

click me!