
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహా శివరాత్రి పురస్కరించుకొని ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న భారీ పీరియాడిక్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కెరీర్ లో మొదటి సారి పవన్ ఓ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నేడు పవన్ లుక్ చూసిన తరువాత ఆ అంచనాలు మరో స్థాయికి చేరాయి.
మెడలో ఎర్రని కండువా...చేతికి కడియం, నడుము బిగించి, బల్లెంతో శత్రువులను వేటాడుతున్న పవన్ లుక్ వీరోచితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో మొఘలుల వద్ద చాకిరీ చేసే బానిసలు పనిచేస్తూ కనిపిస్తున్నారు. పేదల కోసం పోరాడే వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ రోల్ భీబస్తంగా ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రానికి హరి హర వీరమల్లు అనే టైటిల్ నిర్ణయించారు. గతంలోనే ఈ టైటిల్ ప్రచారం కావడం విశేషం.
మొఘలుల కాలం నాటి యాక్షన్ డ్రామాలో పవన్ బండిపోటుగా కనిపించునున్నారు. నిధి అగర్వాల్, జాక్విలిన్ పెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏ ఏం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తంగా పవన్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా పవన్ లుక్ ఉంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 2022లో ఈ మూవీ విడుదల కానుంది.