దయచేసి నా బయోపిక్ తీయకండి!

By team teluguFirst Published Jul 21, 2021, 7:56 AM IST
Highlights

దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్ లో ప్రియాంక అనేక మైలు రాళ్లు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ప్రియాంక అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. ఈ క్రమంలో అనేక వివాదాలు, అఫైర్స్, నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.

2000లో మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న ప్రియాంక చోప్రా... 2002లో విడుదలైన తమిళ చిత్రం తమిజాన్ తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ప్రియాంక డెబ్యూ మూవీ హీరో, విజయ్ కావడం విశేషం. ఆ తరువాత బాలీవుడ్ లో వరుస అవకాశాలతో సౌత్ ని వదిలేసింది అమ్మడు. ప్రస్తుతం ప్రియాంక రేంజ్ ఏమిటో అందరికీ తెలుసు. ఆమె ఏకంగా హాలీవుడ్ మూవీలలో నటిస్తున్నారు. కోలీవుడ్ నుండి హాలీవుడ్ కి ఎదిగిన ప్రియాంక కెరీర్ ఎందరికో స్ఫూర్తి అని చెప్పాలి. 


దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్ లో ప్రియాంక అనేక మైలు రాళ్లు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ప్రియాంక అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. ఈ క్రమంలో అనేక వివాదాలు, అఫైర్స్, నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. సినిమాకు మించిన ట్విస్ట్స్ కలిగిన ప్రియాంక జీవితం బయోపిక్ గా తెరకెక్కించాలని కొందరు భావిస్తున్నారు. ప్రియాంక బయోపిక్ ఓ మంచి సినిమా అవుతుందని దర్శక నిర్మాతల నమ్మకం. 


అయితే తన బయోపిక్ తెరకెక్కించ వద్దని ప్రియాంక అందరినీ వేడుకుంటున్నారు. తాను జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయని, కాబట్టి, అప్పుడే తన బయోపిక్ తెరకెక్కడం తనకు ఇష్టం లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం మ్యాట్రిక్స్, టెక్స్ట్ ఫర్ యూ అనే రెండు హాలీవుడ్ చిత్రాల్లో ప్రియాంక నటిస్తున్నారు. ఇటీవలే తన 39వ బర్త్ డే జరుపుకుంది. ప్రియాంక బర్త్ డే నాడు భర్త నిక్ జోనాస్ ఆమెతో లేదు. దీనితో ఆమెకు బర్త్ డే బహుమతిగా ఖరీదైన వైన్ బాటిల్ పంపాడు. 


 

click me!