అబ్బా.. ఎన్ని సార్లు కన్ను కొట్టాలి: ప్రియా ప్రకాష్

Published : Jan 28, 2019, 04:44 PM ISTUpdated : Jan 28, 2019, 04:46 PM IST
అబ్బా.. ఎన్ని సార్లు కన్ను కొట్టాలి: ప్రియా ప్రకాష్

సారాంశం

ఈ బ్యూటీ ఎక్కడికెళ్లినా కూడా కన్ను కొట్టమని అందరూ తెగ అడిగేస్తున్నారు. అయినా అలా ఎన్ని సార్లు అని ఈ బ్యూటీ కన్ను గీటుతుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో  బోర్ కొట్టేసినట్లు చెప్పింది. 

ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు. కన్ను గీటి అన్ని వర్గాల కుర్రాళ్ల మనసు దోచేసుకున్న ఈ పిల్ల సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓరు ఆధార్ లవ్ లవర్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న రానుంది. అయితే ఈ బ్యూటీ ఎక్కడికెళ్లినా కూడా కన్ను కొట్టమని అందరూ తెగ అడిగేస్తున్నారు.

అయినా అలా ఎన్ని సార్లు అని ఈ బ్యూటీ కన్ను గీటుతుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో  బోర్ కొట్టేసినట్లు చెప్పింది. అబ్బా.. ఎన్ని సార్లు అని కన్ను కొట్టాలి . ఇప్పటికే 200 సార్లు అలా చేశా.. చాలా బోర్ కొట్టేసినట్లు చెబుతూ అసలు ఆ సీన్ అంతలా వర్కౌట్ అవుతుందని అనుకోలేదని చెప్పింది. ఇక కన్నుకొట్టి ఫెమస్ అవ్వడం హ్యాపీగానే ఉంది కానీ కొంచెం ప్రైవసీ లో తేడా కొట్టడం వాస్తవమని ప్రియా వివరణ ఇచ్చింది. 

ఓరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ కాబోతోంది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాలకుజి నిర్మించారు. తెలుగులో కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తోంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Funky Collections: `ఫంకీ` మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు.. అనుదీప్‌ దెబ్బకి విశ్వక్‌ సేన్‌ జాక్‌ పాట్‌
The Raja Saab : డూప్‌తో యాక్షన్ సీన్స్.. ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ క్లారిటీ