పాన్ ఇడియా స్టార్ ప్రభాస్, సౌత్ స్టార్ హీరో సూర్య. ఈ ఇద్దరు కలిసి ఓ మంచి బిర్యానీ పార్టీ చేసుకున్నారట. అది కూడా అర్ధరాత్రి. సూర్య జీవితంలో మర్చిపోలేని ఆ పార్టీ గురించి రీసెంట్ గా వెల్లడించాడు తమిళ స్టార్ హీరో. ఇంతకీ సూర్య ఏమంటున్నాడంటే.
పాన్ ఇడియా స్టార్ ప్రభాస్, సౌత్ స్టార్ హీరో సూర్య. ఈ ఇద్దరు కలిసి ఓ మంచి బిర్యానీ పార్టీ చేసుకున్నారట. అది కూడా అర్ధరాత్రి. సూర్య జీవితంలో మర్చిపోలేని ఆ పార్టీ గురించి రీసెంట్ గా వెల్లడించాడు తమిళ స్టార్ హీరో. ఇంతకీ సూర్య ఏమంటున్నాడంటే.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చాలా మందికి తెలిసినది.. కొంతలో కొంత మందికి తెలియని విషయం ఏంటీ అంటే.. ఆయన మంచి ఫుడీ. మంచి భోజన ప్రియుడైన ప్రభాస్..కొత్త కొత్త రుచులను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తుంటాడు. ఆయన ఎంత భోజన ప్రియుడో అంతకంటే ఎక్కువగా ఆతిథ్యం గురించి మాట్లాడుకోవాలి. అది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పెదనాన్న..రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోతే లక్షల మందికి 52 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయడమే కాకుండా.. అందరూ మిస్ అవ్వకుండా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలంటూ.. మరీ మరీ చెప్పాడు ప్రభాస్.
ఇక ఆయనతో నటించే సహనటీనటులకు భోజనం విషయంలో పండగే అనాలి. పసందైన ఇంటి భోజనాన్ని తెప్పించి అద్భుతమైన ఆతిథ్యాన్ని అందిస్తుంటారు. ఆయన తయారు చేయించే వంటకాల మెనూ చూస్తే.. ఎంత డైటింగ్ లో ఉన్నవారైనా.. ఎంత ఫుడ్ కంట్రోల్ ఉన్నవారు అయినా.. సరే.. తినకుండా ఉండలేదు. ఇక ఇండియన్ స్టార్స్ లో దీపికా పడుకోన్ మొదలుకొని బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ వరకు ప్రభాస్ అతిథ్యాన్ని స్వీకరించి మైమరిచిపోయి ముగ్ధులయ్యారు.
ఇక తాజాగా తమిళ అగ్రహీరో సూర్య కూడా ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇంట్రెస్టింగ్ విషయానని వెల్లడించాడు. ప్రభాస్ తనకోసం తయారుచేయించిన బిర్యానీ గురించి ఓ ఇంటర్వ్యూలో పదే పదే ప్రస్తావించారు. తన జీవితంలో అంత టేస్టీ బిర్యానీ ఎప్పుడూ తినలేదన్నారు సూర్య. తాను తిన్న బెస్ట్ బిర్యానీ అదేనని మెచ్చుకున్నారు. అంతే కాదు అసలు ఎప్పుడు తన కోసం ప్రభాస్ బిర్యానీ ట్రీట్ ఇచ్చాడో వివరంగా చెప్పాడు సూర్య.
అర్ధరాత్రి తాము బిర్యానీ పార్టీ చేసుకున్నామన్నారు సూర్య. కొన్ని సంవత్సరాల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇద్దరి సినిమాల షూటింగ్స్ జరిగాయి. ఓ రోజు ప్రభాస్ సెట్‌కు వచ్చి రాత్రి డిన్నర్‌కు ఆహ్వానించారు. నా షూట్ పూర్తయ్యేసరికి రాత్రి 11 అయ్యింది దాంతో టైమ్ అయిపోయింది ఇక డిన్నర్ కుదరదనుకుని.. ప్రభాస్‌కు సారీ చెబుదామనుకున్నా. కాని షాకింగ్ ఏంటీ అంటే నా రూమ్‌కి వచ్చిన ప్రభాస్ మీ కోసమే వెయిట్ చేస్తున్నా సర్..బిర్యానీ రెడీగా ఉంది. త్వరగా వచ్చేయండి అని చెప్పారు.
ఆ రోజు అర్ధరాత్రి ప్రభాస్‌తో కలిసి తిన్న బిర్యానీని ఎన్నటికీ మర్చిపోలేను. ప్రభాస్ ఆతిథ్యం నన్ను కట్టిపడేసింది అని సూర్య చెప్పుకొచ్చారు. సూర్య ఒక్కడే కాదు ప్రభాస్ ఆతిథ్యం గురించి సౌత్, నార్త్ స్టార్స్ చాలా మంది గతంలో ఇదే విషయం చెప్పరు. స్టార్స్ తో పాటు షూటింగ్ టీమ్ కు కూడా.. అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతమైన ట్రీట్స్ ఇస్తుంటాడు యంగ్ రెబల్ స్టార్.