
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇష్టపడనివారు ఎవరు ఉంటారు. ఎందుకంటే సెట్స్ లోనూ,బయిటా అందరితో చాలా ప్రెండ్లీగా ఉంటారు. అందులోనూ ప్రభాస్ తో తమన్నా… ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ‘రెబల్’ ఒకటి కాగా… మరొకటి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి'(సిరీస్) కావడం విశేషం. ‘బాహుబలి’ రెండు పార్ట్ లలోనూ తమన్నా నటించింది. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్యా మంచి రాపో ఉంది. ఇక సెట్స్ లో ఖాళీ సమయాల్లో ప్రభాస్ ...అక్కడ వాళ్లతో చెస్ ఆడతారని చెప్తారు. చెస్ లో ప్రభాస్ మంచి నైపుణ్యం అని వినికిడి. ఈ క్రమంలోనే తమన్నాకు ..ప్రభాస్ చెస్ నేర్పాడు అని తెలుస్తోంది. అది ఎప్పుడు జరిగింది అంటారా..
తమన్నాకి చెస్ నేర్పుతున్న ప్రభాస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో కొత్తది కాదు. రెబల్ సినిమా షూటింగ్ సమయంలో వీడియో అది. లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ సినిమాలో ఈ ఇద్దరూ జోడీగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్, తమన్నా చెస్ ఆడారు. ఈ క్రమంలో ప్రభాస్.. తమన్నాకి చెస్ ఎలా ఆడాలో నేర్పుతున్నారు. బిహైండ్ ది సీన్స్ అంటూ ఈ వీడియోని ప్రభాస్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ కి చెస్ అంటే ఎంత ఇష్టమో అని ఫ్యాన్స్ మురిసిపోతూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే ఏం తమన్నాకేనా .. ‘డార్లింగ్ మాకు కూడా చెస్ నేర్పించు; అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో తమన్నా...ఓ ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి చెప్పుకొచ్చింది. ఆయనతో రెండు సినిమాలకి పనిచేసారు కదా… వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది అని ప్రశ్నించగా… ‘రెబల్’ సినిమా టైములో ప్రభాస్ తో ఎక్కువగా మాట్లాడే అవకాశం దక్కలేదు. అయితే ‘బాహుబలి’ సినిమా టైములో మాత్రం ఫ్రెండ్స్ అయిపోయాం. ‘బాహుబలి’ అందరికీ ఓ ఎమోషనల్ జర్నీ. అందరం కలిసి ఉండటం వల్ల ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ ఉండేది. ఆ టైములో ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం ఎక్కువ టైం కేటాయించాడు.కాబట్టి ప్రభాస్ తో ఎక్కువ మాట్లాడే అవకాశం దక్కింది… అంటూ చెప్పుకొచ్చింది. ఏదైమైనా మళ్లీ ఈ కాంబో తెరకెక్కితే చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
కెరీర్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా ప్రభాస్ ప్రస్తుతం వరస భారీ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ సినిమాలతో ఊహించనంత క్రేజ్ తో ముందుకు వెళ్తున్నారు. మరో ప్రక్క మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బబ్లీ బౌన్సర్ సినిమాతో బాలీవుడ్ లో ఓకే అనిపించుకున్న తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’, బాలీవుడ్ మూవీ ‘బోలె చుడియన్’ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.