'సాహో'పై ప్రభాస్ అప్డేట్!

Published : Jul 03, 2019, 02:29 PM IST
'సాహో'పై ప్రభాస్ అప్డేట్!

సారాంశం

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మేజర్ పార్టీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ చూసిన తరువాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ చేస్తుండడంతో ప్రమోషన్స్ కూడా ముమ్మరం చేశారు.

తాజాగా హీరో ప్రభాస్ ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన ఓ స్టిల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. 'ఆస్ట్రియాలోని ఇన్స్ బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్.. గతంలో ఎన్నడూ లేని ఓ అధ్బుతమైన అనుభూతి' అంటూ ట్వీట్ చేశాడు.

ప్రభాస్, శ్రద్దా కపూర్ లపై చిత్రీకరిస్తోన్న ఈ పాటకు వైభవీమర్చంట్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌