బంగార్రాజును కూడా లాగేస్తోంది..?

Published : Jul 02, 2019, 09:36 AM IST
బంగార్రాజును కూడా లాగేస్తోంది..?

సారాంశం

టాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత  పెరుగుతోంది. కాళ్ల దగ్గరకొచ్చిన అవకాశాలను మరో హీరోయిన్స్ తన్నుకుపోతున్నారు. ఆ లిస్ట్ లో పూజా హెగ్డే రెచ్చిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు ఈ మధ్య నాన్ స్టాప్ గా అవకాశాలను అందుకుంటోంది.   

టాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత డోస్ పెరుగుతోంది. కాళ్ల దగ్గరకొచ్చిన అవకాశాలను మరో హీరోయిన్స్ తన్నుకుపోతున్నారు. ఆ లిస్ట్ లో పూజా హెగ్డే రెచ్చిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు ఈ మధ్య నాన్ స్టాప్ గా అవకాశాలను అందుకుంటోంది. 

రీసెంట్ గా ఇద్దరు హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసిన బంగార్రాజు అవకాశాన్ని అమ్మడు లాగేసుకున్నట్లు టాక్ వస్తోంది. బంగార్రాజులో నాగ్ హీరోయిన్ కోసం ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని అలాగే కాజల్ వంటి సీనియర్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు. అయితే చివరికి పూజ హెగ్డే వైపుకు చిత్ర యూనిట్ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు నాగ చైతన్యకు జోడిగా కీర్తి సురేష్ నటించనుంది. ఈ క్రమంలో నాగార్జునకి పాట్నర్ ని సెలెక్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతోంది. ఫైనల్ గా రేస్ లో ఉన్న పూజా హెగ్డే ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సెలెక్ట్ చేసినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్నీ రోజులు వెయిట్ చేయాల్సిందే.    

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు