`ఆదిపురుష్‌`పై, సైఫ్‌ అలీ ఖాన్‌, ఓం రౌత్‌లపై కోర్ట్ లో పిటిషన్‌..ఏం జరిగింది?

Published : Dec 17, 2020, 07:40 AM ISTUpdated : Dec 17, 2020, 07:53 AM IST
`ఆదిపురుష్‌`పై, సైఫ్‌ అలీ ఖాన్‌, ఓం రౌత్‌లపై కోర్ట్ లో పిటిషన్‌..ఏం జరిగింది?

సారాంశం

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. `రాముడితో రావణుడు యుద్ధం చేయడం కరెక్టే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని `ఆదిపురుష్‌`లో చూపించబోతున్నాం` అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న `ఆదిపురుష్‌`పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కూడా భారీ స్థాయిలో ఉంటుందని ప్రచారం జరిగింది. తాజాగా దీన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఓ న్యాయవాది సినిమాపై, సైఫ్‌ అలీఖాన్‌పై కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. మరి ఆ న్యాయవాది ఎవరు, ఎందుకు పిటిషన్‌ దాఖలు చేశారనేది చూస్తే.. 

ఇటీవల బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. `రాముడితో రావణుడు యుద్ధం చేయడం కరెక్టే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని `ఆదిపురుష్‌`లో చూపించబోతున్నాం` అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనేక విమర్శలు రావడంతో ఎట్టకేలకు సైఫ్‌ స్పందించారు. క్షమాపణలు చెప్పారు. 

కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది మాత్రం ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఆయన `ఆదిపురుష్‌` సినిమాపై, సైఫ్‌ అలీఖాన్‌పై జౌన్‌పూర్‌ కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. సైఫ్‌ చేసిన వ్యాఖ్యలు మత విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సైఫ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ పేరుని కూడా పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ రావణుడిగా కనిపించనున్నారట. కృతి సనన్‌ సీత పాత్రలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఓం రౌత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ లతో కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాని ప్రారంభించి 2022 ఆగస్ట్ 11న సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం