మళ్ళీ నెగిటివ్ రోల్ లో RX100 బ్యూటీ!

By Prashanth MFirst Published Jun 9, 2019, 3:10 PM IST
Highlights

RX100సినిమాలో గ్లామర్ తో పాటు విలన్ షేడ్స్ లో కనిపించి ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అయితే నెక్స్ట్ సినిమాలో కూడా అమ్మడు నెగిటివ్ రోల్ లో కనిపించి షాకివ్వనుందట. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ బయోపిక్ లో పాయల్ ఒక వేశ్య పాత్రలో కనిపించనుంది. 

పోలీసులను ముప్పు తిప్పలు పెట్టె నాగేశ్వరరావు చావుకు ముఖ్య కారణమయ్యే పాత్ర అదేనట. ప్రజల్లో ఉన్న సమాచారం ప్రకారం అప్పట్లో నాగేశ్వరరావు పోలీసులకు చిక్కాడానికి కారణం అతనికి సన్నిహితంగా ఉండే వేశ్య అని తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందించి రాబిన్ హుడ్ లాంటి నాగేశ్వర రావు జీవితానికి ఎండ్ కార్డు వేసిందని చెప్పుకుంటారు. 

అయితే దర్శకుడు వంశీ కృష్ణ గజదొంగ సినిమాను ఎలాంటి స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తాడో చూడాలి. మొదట రానా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ చివరికి సినిమా బెల్లకొండ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లింది. సినిమాను ఆగస్ట్ లో మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. ఈ ఏడాది ఎండింగ్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

click me!