కీరవాణి నిర్ణయానికి ఓకె చెప్పిన పవన్.. హరిహర వీరమల్లులో స్పెషల్ ట్రీట్ ?

Published : Apr 24, 2023, 03:53 PM IST
కీరవాణి నిర్ణయానికి ఓకె చెప్పిన పవన్.. హరిహర వీరమల్లులో స్పెషల్ ట్రీట్ ?

సారాంశం

చాలా కాలంగా వీరమల్లు చిత్రం వాయిదా పడుతూ ఉండడంతో ఫ్యాన్స్ విసిగిపోయారు. అయితే పవన్ ఫ్యాన్స్ లో కాస్త ఉత్సాహం నింపేలా ఇంటరెస్టింగ్ డెవలప్ మెంట్ జరిగింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు పరిమితం అయ్యారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి, హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పవన్ ఈ రెండు చిత్రాలకు డేట్లు అడ్జెస్ట్ చేస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

దీనితో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం కొంతకాలం వాయిదా పడ్డట్లు అయింది. ఓజి, ఉస్తాద్ చిత్రాలు కొలిక్కి వచ్చిన తర్వాతే పవన్ హరిహరవీరమల్లు మిగిలిన షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు మ్యూజిక్ రికార్డింగ్స్, ఇతర పెండింగ్ వర్క్ ని క్రిష్ పూర్తి చేస్తున్నారట. తాజాగా ఈ చిత్రం గురించి వైరల్ అవుతున్న న్యూస్ పవన్ ఫ్యాన్స్ లో జోష్ ని పెంచుతోంది. 

చాలా కాలంగా వీరమల్లు చిత్రం వాయిదా పడుతూ ఉండడంతో ఫ్యాన్స్ విసిగిపోయారు. అయితే పవన్ ఫ్యాన్స్ లో కాస్త ఉత్సాహం నింపేలా ఇంటరెస్టింగ్ డెవలప్ మెంట్ జరిగింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో ప్రత్యేక్ష సందర్భంలో ఓ పవర్ ఫుల్ సాంగ్ ఉండబోతోంది. ఆ పాటకి పవన్ వాయిస్ అయితే ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుందని కీరవాణి భావించారట. పవన్ కళ్యాణ్ ని రిక్వస్ట్ కూడా చేశారట. దీనితో కీరవాణి నిర్ణయానికి పవన్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పాట రికార్డింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్. 

పవన్ కళ్యాణ్ పాట పాడడం కొత్తేమి కాదు. గతంలో పవన్ జానీ, తమ్ముడు, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాల కోసం పాటలు పాడారు. ఇప్పుడు కీరవాణి పవన్ సంగీత సారధ్యంలో పవన్ పాట పాడబోతున్నాడనే న్యూస్ చాలా ఆసక్తిగా మారింది. దీని గురించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా