#OG అప్డేట్స్ అడగొద్దు, మీ ఆకలి మాకు తెలుసు

Published : Dec 13, 2023, 07:26 AM IST
#OG అప్డేట్స్ అడగొద్దు, మీ ఆకలి మాకు తెలుసు

సారాంశం

వెండితెర మీద తమ అభిమాన దేవుడిని చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ రోజులు వెయిట్ చేయక తప్పదు

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) యంగ్ డైరక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’ (OG) (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే  సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘సాహో’ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకున్న సుజీత్‌.. పవన్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.  ఇక ఈ మూవీని ప్రకటించిన నాటి నుంచే వరుస అప్‌డేట్‌లతో చిత్రబృందం ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా ఆగాయి. అందుకు కారణం అందరికీ తెలిసిందే. పవన్ రాబోయే ఎలక్షన్స్ కు సంభందించిన టూర్స్, సమావేశాలు, మీటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాంతో ఈ చిత్రం షూటింగ్ జరగటం లేదు. కానీ అభిమానులు మాత్రం అప్డేట్స్ చెప్పండి అంటూ టీమ్ పైకి కామెంట్స్ దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చిత్రం టీమ్ ఓ ప్రకటన చేసి క్లారిటీ ఇచ్చేసింది.

''పుట్టినరోజు శుభాకాంక్షలతో మా టైమ్ లైన్ అంతా నిండిపోయింది. అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆకలి మీద ఉన్నారు. ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఏమంటే... ప్రస్తుతం మేం షూటింగ్ చేయడం లేదు. అందువల్ల, అప్డేట్స్ ఇవ్వడం కోసం మరింత టైం పడుతుంది. వెండితెర మీద తమ అభిమాన దేవుడిని చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ రోజులు వెయిట్ చేయక తప్పదు'' అని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.  

 ఇక  ‘ఓజీ’ స్టోరీ లైన్‌ గురించి చెప్పాలంటే... ‘‘ఓజస్ గంభీరా (పవన్‌కల్యాణ్‌) అనే వ్యక్తి సాధారణ టూరిస్ట్‌గా ముంబయికి వస్తాడు. అనుకోకుండా అతడు గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. మాఫియాతోపాటు ఎన్నో నేరాలు చేసి తనకంటూ ఒక నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ ప్రయాణంలో అతడు తన కుటుంబాన్ని కోల్పోతాడు. దీనికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. డ్రగ్‌ మాఫియాను తుడిచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు’’.ఈ సినిమాలో ఆయన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు.

‘సాహో’ తర్వాత సుజిత్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. జపాన్‌-ముంబయి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌ సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య దీనిని నిర్మిస్తున్నారు.  తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక దీనితో పాటు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, క్రిష్‌ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’లోనూ పవన్‌ నటిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది