విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తాడా..?

Published : Jul 03, 2019, 04:42 PM IST
విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తాడా..?

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' అనే పెద్ద హిట్ సినిమాను రూపొందించాడు. 

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' అనే పెద్ద హిట్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమా తరువాత మరే సినిమా ఓకే చేయలేదు ఈ డైరెక్టర్. మహేష్ తో సినిమా చేయడం కోసం కథ రెడీ చేశాడు.

కానీ ఆ స్టోరీ అల్లు అరవింద్ కి నచ్చకపోవడంతో వేరే బ్యానర్ లో చేయడం కోసం ప్రయత్నించాడు. కానీ మహేష్ బాబు లిస్ట్ లో వరుస సినిమాలు ఉండడంతో మరో హీరో కోసం వేట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మరోసారి విజయ్ దేవరకొండ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ కి లైన్ చెప్పి ఓకే చేయించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'గీత గోవిందం' కాంబినేషన్ అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ తో సినిమా చేస్తున్నాడు.

మరోపక్క విక్రమ్ కె కుమార్ స్క్రిప్ట్ వినడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పరశురాంతో సినిమాకు ఎంత ఛాన్స్ ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి. మరేదైనా చిన్న సినిమా చేద్దామంటే.. పరశురాం రెమ్యునరేషనే ఐదు కోట్ల వరకు ఉంటుంది. మరి పరశురాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు