ఎన్టీఆర్ లానే ఉన్న అభిమాని.. ఫోటోలు వైరల్!

Published : May 13, 2019, 11:59 AM IST
ఎన్టీఆర్ లానే ఉన్న అభిమాని.. ఫోటోలు వైరల్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు డూప్ లు ఉండడం సహజమే.. అప్పుడప్పుడు వారిని సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం వాడుకుంటూ ఉంటారు

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు డూప్ లు ఉండడం సహజమే.. అప్పుడప్పుడు వారిని సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం వాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత అచ్చం మన తారల పోలికలతో ఉన్న కొందరు బాగా వైరల్ అవుతున్నారు.

తాజాగా ఎన్టీఆర్ లానే ఉన్న ఓ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడి పేరు షమీందర్ సింగ్. స్వస్థలం పంజాబ్. ఇతడు ఎరోనాటికల్ ఇంజనీర్. చూడడానికి అచ్చం తారక్ లానే ఉండడంతో సోషల్ మీడియాలో అతడికి క్రేజ్ పెరిగింది.

ఇటీవల ఆయన కొన్ని టిక్ టాక్ వీడియోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇవి చూసిన తారక్ అభిమానులు అతడికి మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టారు. తన గురించి వివరాలు చెప్పిన షమీందర్ సూపర్ స్టార్ పోలికలతో ఉండడం గర్వంగా ఉందనిపిస్తుందని అన్నారు.

తనకు తారక్ ని కలవాలని ఉందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తారక్ ని కలవడానికి హైదరాబాద్ రావాలనుందని అంటున్నాడు. దీంతో తారక్ కి సన్నిహితుడు, నిర్మాత మహేష్ కోనేరుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?