హీరోగా ఎన్టీఆర్ బావమరిది! డైరక్టర్ ఎవరంటే..

By Surya Prakash  |  First Published Mar 24, 2021, 8:00 AM IST

 ఆ మధ్యన వినపడి, సైలెంట్ అయిన వార్త మరోసారి మీడియాలో గుప్పుమంది. హీరోగా రాబోతున్న ఎన్టీఆర్ బావమరిది..? అంటూ వార్తలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వస్తన్నాయి. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుని.. నార్నె నితిన్ పక్కాగా ప్రిపేర్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.  డ్యాన్సులు, ఫైట్స్ లోనూ శిక్షణ తీసుకున్నట్లు  చెప్తున్నారు. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత...నితిన్ లాంచ్ చేస్తున్న డైరక్టర్ ఎవరు, ఏ ప్రొడక్షన్ హౌస్ ద్వారా లాంచ్ కాబోతున్నాడు వివరాలు చూద్దాం. 
 
మీడియాలో వస్తున్న వార్తలను బ్టటి...ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడు, లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత కొద్దికాలంగా నితిన్‌ కథలను వింటున్నట్లు సమాచారం. ఇందులో ఓ కథని నితిన్ ఓకే చేసారట. ఇక  నితిన్‌ని టాలీవుడ్‌కి ఎవరు పరిచయం చేస్తున్నారు..? అంటే డైరక్టర్ తేజ అని చెప్తున్నారు. ఆయనే నితిన్ చంద్రను  వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు.  'చిత్రం' సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'చిత్రం 1.1'లో నటించబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో పెట్టుబడి నార్నే శ్రీనివాసరావు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Latest Videos

అలాగే తాజా స‌మాచారం నితిన్ చంద్ర ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 18న నార్నె నితిన్ చంద్ర హీరోగా న‌టించ‌బోయే సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ‌అయితే అఫీషియల్ సమాచారం కాదు. 

ఇక ఈ విషయం తెలుకున్న ఎన్టీఆర్ ఏమన్నారు అనే విషయం చూస్తే.....హీరోగా రాణించడం అన్నది కత్తి మీద నడకలాంటిదని, కాస్త బ్యాలెన్స్ తప్పినా ఆ ఎఫెక్ట్ కెరీర్ మొత్తం మీద పడుతుందని,జాగ్రత్తగా స్టెప్ లు తీసుకోమని సూచించినట్లు టాక్‌. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో కాంపిటేషన్‌ చాలా ఉందని, అదే సమయంలో యంగ్ టాలెంట్ ని ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తోందని ఇలాంటి సమయంలో హీరోగా రావటం మంచిదని,ప్రోత్సహించినట్లు  తెలుస్తోంది.  ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నితిన్‌కి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. మరి ఇందులో నిజమెంత..? అనేది తెలియాల్సి ఉంది. 

click me!