అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం వార్త..ఖండన

Surya Prakash   | Asianet News
Published : Oct 16, 2020, 12:20 PM IST
అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం వార్త..ఖండన

సారాంశం

 ఆ వార్తలను అన్ని పూర్ణ స్టూడియోస్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఖండించింది.   అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉందని అసలు కన్ఫర్మ్ కానీ వార్తలు ఎవరు నమ్మొద్దని తమ సోషల్ మీడియా ద్వారా విన్నవించారు.  

హైదరాబాద్ లోని  అన్నపూర్ణ స్టూడియోస్ లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిందంటూ ప్రముఖ దినపాత్రికలు వెబ్ సైట్స్ లో  వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను అన్ని పూర్ణ స్టూడియోస్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఖండించింది.   అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉందని అసలు కన్ఫర్మ్ కానీ వార్తలు ఎవరు నమ్మొద్దని తమ సోషల్ మీడియా ద్వారా విన్నవించారు.

ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే...  శుక్రవారం ఉదయం స్టూడియోలో మంటలు  చెలరేగాయి. దాంతో కొంత సమయానికే అన్నపూర్ణ స్టూడియో లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ స‌ర్క్యూట్ జ‌ర‌గ‌డంతో ప్ర‌మాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది అని. అయితే అదంతా నిజం కాదని అన్నపూర్ణ వారే స్వయంగా చెప్పారు కాబట్టి డోంట్ వర్రీ. 
 
ఈ అగ్ని ప్రమాదం వార్త నేపథ్యంలో అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ ల పరిస్దితి ఏమటన్న కంగారు మొదలైంది. అదే సమయంలో  బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతుండటంతో కొంత టెన్షన్ నెలకొంది. ఇప్పుడు అందరూ కూల్ గా ఉండచ్చు. ఇంతకీ ఈ వార్త ఎలా మొదలైందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..