మరో మెగా హీరోతో నివేథా పేతురాజ్ రొమాన్స్!

Published : Jun 06, 2019, 08:21 PM IST
మరో మెగా హీరోతో నివేథా పేతురాజ్ రొమాన్స్!

సారాంశం

తమిళంలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సొంతం చేసుకున్న నివేథా పేతురాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన సాయిధరమ్ తేజ్ చిత్రం చిత్రలహరిలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

తమిళంలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సొంతం చేసుకున్న నివేథా పేతురాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన సాయిధరమ్ తేజ్ చిత్రం చిత్రలహరిలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. నివేథా పేతురాజ్ కు అందంతో పాటు మంచి నటిగా పేరుంది. 

తాజాగా నివేథాని ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఇప్పటికే అవాకాశం దక్కించుకుంది. సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. చాలా రోజులుగా ఆ పాత్రకు సరిపడే నటి కోసం వెతుకుతున్నారు. 

సెకండ్ హీరోయిన్ ఛాన్స్ నివేథా పేతురాజ్ ని వరించినట్లు తెలుస్తోంది. త్వరలో నివేథా షూటింగ్ లో కూడా జాయిన్ కాబోతోందట. ఇటీవలే ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. 

PREV
click me!

Recommended Stories

Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?