Nithiin: నితిన్ ప్లాన్ అదిరింది...పెద్ద సినిమా రైట్స్ పట్టేసాడు,కొడితే కుంభస్దలమే

By Surya PrakashFirst Published May 20, 2022, 6:08 AM IST
Highlights

ఇంతపెద్ద సినిమా హక్కులు కొనడంతో నితిన్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లే అని ట్రేడ్ లో చెప్తున్నారు. 

వరస ప్రాజెక్టులతో బిజిగా ఉన్న నితిన్ మధ్య మధ్యలో తన సొంత నిర్మాణ సంస్ద శ్రేష్ట్ మూవీస్ మంచి ,చెడులు చూస్తూంటారు. తన బ్యానర్ పై సినిమాలు ప్లాన్ చేస్తూంటారు. రీసెంట్ గా తనే హీరోగా అంధాధూన్ రీమేక్ ని మాస్ట్రో టైటిల్ తో చేసిన నితిన్ ఇప్పుడు అదే బ్యానర్ లో కమల్ విక్రమ్ చిత్రం రైట్స్ సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

విశ్వనటుడు కమల హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌  తో కలిసి కమల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాల్లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండగా క్యామియో రోల్ లో సూర్య కనిపించనున్నాడు. 

ఇప్పటికే  ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిత్ర రైట్స్‪ని.. నితిన్ సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్   సొంతం చేసుకోంది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Extremely Glad to b associated with to present the much awaited film of Ulaganayagan sir’s in Telugu under our banner 🤗

Grand Release on June 3rd 🌟 https://t.co/VoTsXdxPh4

 ” టర్మరిక్ మీడియా తో అశోశియేట్ అవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరు ఎంతగానో  ఎదురుచూస్తున్న విశ్వనటుడు కమల్ సార్ నటించిన విక్రమ్ ను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో  జూన్ 3 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.” అంటూ చెప్పుకొచ్చాడు.   ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏదిఏమైనా ఇంతపెద్ద సినిమా హక్కులు కొనడంతో నితిన్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లే అని ట్రేడ్ లో చెప్తున్నారు. 

విక్రమ్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
 

click me!