ముద్రతో సిద్దమైన నిఖిల్!

Published : Oct 30, 2018, 08:29 PM IST
ముద్రతో సిద్దమైన నిఖిల్!

సారాంశం

ఎక్కడికి పోతావు చిన్నవాడా - కేశవ సినిమాలతో పరవాలేధనిపించుకున్న నిఖిల్ సిద్దార్థ్ ఈ ఏడాది కిర్రాక్ పార్టీతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా - కేశవ సినిమాలతో పరవాలేధనిపించుకున్న నిఖిల్ సిద్దార్థ్ ఈ ఏడాది కిర్రాక్ పార్టీతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో ముద్ర అనే ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. నిఖిల్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటించాడు. 

దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. డిసెంబర్ 28న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. నిఖిల్ కు జంటగా అర్జున్ సురవరం నటిస్తుండగా మరొక ముఖ్య పాత్రలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమాపై నిఖిల్ మంచి విజయం సాదిస్తుందని చాలా నమ్మకం పెట్టుకున్నాడు. 

ముద్ర సినిమా కోసం ఫిట్ నెస్ లో కూడా మార్పులు చేసి సరికొత్తగా కనిపించడానికి చాలానే కృషి చేశాడు. మరి నిఖిల్ ఎంతవరకు హిట్టందుకుంటాడో చూడాలి. తమిళ్ లో బాక్స్ ఆఫీస్ స్థాయిలో హిట్టందుకున్న కనిథన్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ సినిమాకు టీఎన్ సంతోష్ దర్శకత్వం వహించాడు.   

PREV
click me!

Recommended Stories

Bandla Ganesh: పెద్దమనిషి చేతిలో చెప్పుదెబ్బలు, భార్య ముందు కన్నీళ్లు.. బండ్ల గణేష్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..