పావలా కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ!

Published : Sep 03, 2019, 11:40 AM IST
పావలా కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ!

సారాంశం

అందరి హీరోల ఫ్యాన్స్ ఓ లెక్క.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో లెక్క. తేడాలొస్తే మెగా హీరో అని కూడా చూడరు. పవన్ కళ్యాణ్ పేరును చెప్పను బ్రదర్ అని అన్నందుకే అల్లు అర్జున్‌కి చుక్కలు చూపించారు. అలాంటిది పవన్ బర్త్ డే రోజు.. ఆయన్ని పావలా కళ్యాణ్ అంటే ఊరుకుంటారా?

సెప్టంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. పైగా నిన్న వినాయకచవితి కావడం జనసైనికులు సంబరాలలో మునిగితేలారు.

మిలియన్ల కొద్దీ ట్వీట్స్ తో విషెస్ చెప్పడంతో పవన్ పేరు ఇండియాలో టాప్ 1 ట్రెండింగ్ గా నిలిచింది.  అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం పవన్ నామస్మరణ చేస్తూ  వరుసగా ట్వీట్లు చేశారు. పవన్ తో కలిసి పని చేసిన హీరోయిన్లు కూడా ఆయన విషెస్ చెప్పారు.

'కొమరం పులి' సినిమాలో పవన్ సరసన నటించిన నికీషా పటేల్.. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న 
‘‘#HappyBirthdayPawalaKalyan, #HappyBirthdayPawanaKalyanfromSSMBfans, #HappyBirthdayPawalaKalyan #HappyBirthdayPSPK #pawankalyan’’ హ్యాష్ ట్యాగ్‌లను జత చేసింది.  

వీటిలో పవన్‌కి బదులుగా పావలా అని ఉన్న హ్యాష్ ట్యాగ్‌ను గుర్తించకపోవడంతో అదే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసేసింది నికీషా పటేల్. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు గ్రహించిన నికీషా వెంటనే ఆ ట్వీట్ ని తొలగించి పవన్ అభిమానులకు క్షమాపణలు చెప్పి కొత్తగా మరో ట్వీట్ చేసింది. 

 

 

PREV
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌