దర్శకుడి సెంటిమెంట్.. పాపం నయనతార!

Siva Kodati |  
Published : May 14, 2019, 10:51 AM IST
దర్శకుడి సెంటిమెంట్.. పాపం నయనతార!

సారాంశం

లేడి సూపర్ స్టార్ నయనతార హవా రోజు రోజుకు పెరుగుతోంది. దర్శక నిర్మాతలు నయన్ ని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు అడ్వాన్సులతో ఆమె ఇంటికి ఎగబడుతున్నారు. కానీ నయన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. 

లేడి సూపర్ స్టార్ నయనతార హవా రోజు రోజుకు పెరుగుతోంది. దర్శక నిర్మాతలు నయన్ ని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు అడ్వాన్సులతో ఆమె ఇంటికి ఎగబడుతున్నారు. కానీ నయన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. వరుస క్రేజీ చిత్రాల్లో నయనతార బిజీగా గడుపుతోంది. నయనతార ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన దర్భార్ చిత్రంలో, ఇళయదళపతి 63వ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా చిత్రంలో కూడా నటిస్తోంది. 

అన్నీ పెద్ద చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నయన్ కు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఆఫర్ ని అంగీకరించే స్థితిలో నయనతార లేదు. అజిత్ తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు శివ త్వరలో సూర్యతో ఓ చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతారని సంప్రదించారట. కానీ ఈ చిత్రం చేయలేనని, తన కాల్ షీట్స్ ఖాళీగా లేవని నయనతార చెప్పిందట. 

దర్శకుడు శివ మాత్రం నయన్ ని విడిచిపెట్టలేదు. సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మే దర్శకులలో శివ ఒకరు. అజిత్, నయనతార కలసి నటించిన విశ్వాసం చిత్రం ఘనవిజయం సాధించింది. దీనితో ఈ దర్శకుడికి నయన్ సెంటిమెంట్ గా మారిపోయిందట. ఇదే విషయాన్ని శివ నయన్ కు చెప్పి రిక్వస్ట్ చేశారట. దీనితో నయనతార కాదనలేక కష్టమైన ఎలాగోలా ఈ చిత్రంలో నటిస్తానని తన అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా దర్శకుడి సెంటిమెంట్ వల్ల నయనతార సూర్య చిత్రాన్ని అంగీకరించక తప్పలేదు. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా