`బేబీ` సినిమాపై నయనతార భర్త ప్రశంసలు.. ఈ బోల్డ్ మూవీకి రికార్డులు బద్దలవుతున్నాయంటూ పోస్ట్

Published : Jul 26, 2023, 10:47 PM IST
`బేబీ` సినిమాపై నయనతార భర్త ప్రశంసలు.. ఈ బోల్డ్ మూవీకి రికార్డులు బద్దలవుతున్నాయంటూ పోస్ట్

సారాంశం

`బేబీ`సినిమాపై సుకుమార్ లాంటి వారు ప్రశంసించారు. తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార భర్త, తమిళ దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ సైతం తన ప్రశంసలు కురిపించారు.  

`బేబీ` సినిమా సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. చిన్న సినిమాగా ప్రారంభమై ఇది రికార్డులు షేక్ చేస్తుంది. పది-పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా డెబ్బై కోట్లు దాటింది. ఇంకా విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ సినిమాపై క్రిటిక్స్, సినిమా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుకుమార్ లాంటి వారు కూడా సినిమా అద్బుతంగా ఉందంటూ ప్రశంసించారు. తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార భర్త, తమిళ దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ సైతం తన ప్రశంసలు కురిపించారు.

`బేబీ` సినిమా చూసిన ఆయన మూవీపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈసినిమా గురించి గొప్పగా రాసుకొచ్చారు. ఈ కమింగ్‌ ఏజ్‌ మూవీకి దెబ్బకి క్రేజీ రికార్డులు బద్దలవుతున్నాయి. ఇది బోల్డ్ టీమ్‌ చేసిన ప్రయత్నం. బోల్డ్ గా రాయడమే కాదు, అంతే క్రూరంగా తెరపైకి ఎక్కించారు. ఇది గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు` అని తెలిపారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు సాయి రాజేష్‌, హీరో ఆనంద్‌ దేవరకొండస్పందిస్తూ విగ్నేష్‌ శివన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

సాయి రాజేష్‌ దర్శకత్వంలో రూపొందిన `బేబీ` సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌కేఎన్ నిర్మించారు. జులై 14న ఈసినిమా విడుదలైన విషయం తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రేపటి వరకు ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని చెప్పొచ్చు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?