విక్రమ్ సినిమాకి నాని స్క్రీన్ ప్లే!

By Udayavani DhuliFirst Published Dec 19, 2018, 4:49 PM IST
Highlights

చాలా మంది డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి నటులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. మోహన్ బాబు నుండి రవితేజ, నాని నుండి రాజ్ తరుణ్ ఇలా చాలా మంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే. 

చాలా మంది డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి నటులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. మోహన్ బాబు నుండి రవితేజ, నాని నుండి రాజ్ తరుణ్ ఇలా చాలా మంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే.

కానీ నటులుగా మారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే వారికి డైరెక్టర్ అవ్వాలనే కల మాత్రం అలానే ఉండిపోతుంది. ఇప్పుడు ఆ కలను మరోరూపంలో తీర్చుకోబోతున్నాడు హీరో నాని. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయబోతున్నాడట నాని. విక్రమ్ తో పాటు కూర్చొని స్క్రీన్ ప్లే రాయాలని నిర్ణయించుకున్నాడట మన నేచురల్ స్టార్.

అయితే టైటిల్స్ లో క్రెడిట్ తీసుకుంటాడా..? లేదా..? అనే విషయంలో స్పష్టత రానప్పటికీ తన సినిమా కోసం తనే పెన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. త్వరలోనే విక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. 

click me!