'గ్యాంగ్ లీడర్'గా దూసుకొస్తున్న నాని.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Siva Kodati |  
Published : May 17, 2019, 02:09 PM IST
'గ్యాంగ్ లీడర్'గా దూసుకొస్తున్న నాని.. రిలీజ్ డేట్ ఫిక్స్!

సారాంశం

నేచురల్ స్టార్ నాని ఇటీవల విడుదలైన జెర్సీ చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో నాని ఎమోషనల్ పెర్ఫామెన్స్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జెర్సీ చిత్రం నాని కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది.

నేచురల్ స్టార్ నాని ఇటీవల విడుదలైన జెర్సీ చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో నాని ఎమోషనల్ పెర్ఫామెన్స్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జెర్సీ చిత్రం నాని కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. త్వరలోనే నాని మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ని పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గ్యాంగ్ లీడర్ చిత్రంలో నాని చిన్న చిన్న దొంగతనాలు చేసే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా గ్యాంగ్ లీడర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.  ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 30న గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీస్ సంస్థ ప్రకటించింది. 

గ్యాంగ్ లీడర్ చిత్రంలో విక్రమ్ కుమార్ మార్క్ స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని వేగంగా ఫినిష్ చేస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Sivakarthikeyan Salary: మాట్లాడుకున్న దానికంటే డబుల్ డిమాండ్‌ చేసిన శివకార్తికేయన్‌.. దెబ్బకి నిర్మాత షాక్‌