Spark of 'Dasara': నాని ఊర మాస్ ఎంట్రీ అదుర్స్.. కెరీర్ లో ఫస్ట్ టైం..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 20, 2022, 12:41 PM ISTUpdated : Mar 20, 2022, 12:47 PM IST
Spark of 'Dasara': నాని ఊర మాస్ ఎంట్రీ అదుర్స్.. కెరీర్ లో ఫస్ట్ టైం..

సారాంశం

నాని నటిస్తున్న దసరా చిత్రం నుంచి స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో ఫస్ట్ లుక్ వీడియో విడుదలయింది. ఈ వీడియోలో నాని ఊర మాస్ గెటప్ లో అదరగొడుతున్నాడు.   

నేచురల్ స్టార్ నాని గత ఏడాది డిసెంబర్ లో శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో అభిమానులని పలకరించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. నాని నటిస్తున్న తదుపరి చిత్రం 'దసరా'. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు. ఆ మధ్యన విడుదలైన మోషన్ పోస్టర్ లో నాని లుక్ రఫ్ గా ఉండబోతున్నట్లు అర్థం అయింది.

తాజాగా 'స్పార్క్ ఆఫ్ దసరా' పేరుతో దసరా చిత్రం నుంచి నాని ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో నాని లుక్, ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. కెరీర్ లో నాని తొలి సారి ఇలా ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. బీడీ వెలిగిస్తూ, లుంగీలో, చెమటలు పట్టిన శరీరంతో నాని ఎంట్రీ అదిరిపోయింది. 

నాని తన గ్యాంగ్ తో మైనింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి నడుచుకుంటూ వస్తున్న విధానం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత. నేను లోకల్ తర్వాత కీర్తి సురేష్ మరోసారి నానితో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో కమర్షియల్ గా బలమైన విజయం సొంతం చేసుకోవాలని నాని ప్రయత్నిస్తున్నాడు. దసరా చిత్రం తెలుగు తమిళ, మలయాళీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఈ వీడియో ద్వారా షూటింగ్ ప్రారంభమైనట్లు ప్రకటించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి