మలయాళ దర్శకుడితో నాని పాన్‌ ఇండియా మూవీ?

Published : May 27, 2023, 02:54 PM IST
మలయాళ దర్శకుడితో నాని పాన్‌ ఇండియా మూవీ?

సారాంశం

నేచురల్ స్టార్‌ నాని ప్రస్తుతం తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త సినిమాకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. అయితే ఈ సారి మలయాళ దర్శకుడితో పనిచేయబోతున్నారట. 

నేచురల్‌ స్టార్‌ నాని.. ఇన్నాళ్లు క్లాస్‌ మూవీస్‌కే పరిమితమయ్యాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేసుకుంటూ వచ్చాడు. కానీ దాన్ని బ్రేక్‌ చేస్తూ `దసరా`తో అన్ని బౌండరీలు బ్రేక్‌ చేశాడు. ఈసినిమాతో తన సత్తాని చాటాడు. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా తెలంగాణలోనే ఆడింది, కానీ ఏపీలో ఆదరణ పొందలేకపోయింది. అక్కడి ఆడియెన్స్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో అక్కడ బయ్యర్లకి నష్టాలనే మిగిల్చింది. కాకపోతే ఓవర్సీస్‌లో మాత్రం దుమ్ములేపింది. ఓవరాల్‌గా నిర్మాత సేఫ్‌లోనే ఉన్నాడు, కానీ బయ్యర్లు నష్టపోయారు. అందుకే రిలీజ్‌ తర్వాత హడావుడి చేయలేదు. కానీ నానికి పాన్‌ ఇండియా ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఈ సినిమాతో నాని హీరోగా నెక్ట్స్ లెవల్‌కి చేరుకున్నాడు. దానికి తగ్గట్టుగానే కొత్త సినిమాలను ప్లాన్‌ చేసుకుంటున్నాడు నాని.  

ప్రస్తుతం నాని `నాని30`(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తున్నారు. శౌర్యువ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కూతురుకి తండ్రిగా నటిస్తున్నారు నాని. మృణాల్‌ ఠాకూర్‌, శృతి హాసన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. దీన్ని కూడా పాన్‌ ఇండియా సినిమాగా ప్లాన్‌ చేస్తున్నారు. నెక్ట్స్ మరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట నాని. అయితే ఈ సారి మలయాళ స్టార్‌ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతుండటం విశేషం. `దృశ్యం` సినిమాలు ఇండియా వైడ్‌గా ఎంతటి సంచలనాలు క్రియేట్‌ చేశాయో తెలిసిందే. దాదాపు అన్ని భాషల్లోనూ రీమేక్‌ అయ్యాయి. దీనికి దర్శకుడు జీతూ జోసెఫ్‌. 

తాజాగా జీతూ జోసెఫ్‌.. నానికి ఓ కథ చెప్పారట. ఇటీవల ఈ ఇద్దరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా నానికి ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీని నెరేట్‌ చేశారట దర్శకుడు. స్టోరీ నచ్చడంతో నాని సైతం ఓకే చేశాడని తెలుస్తుంది. దీన్ని పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట.  ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అయ్యిందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే నానికి జీతూ జోసెఫ్‌.. తాను రూపొందించిన మలయాళ మూవీ `కూమన్‌ః ది నైట్‌ రైడర్‌` సినిమా కథ చెప్పారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నారట. ఈ రీమేక్ గురించే నానిని కలిశారని, ఈ సినిమా రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏది నిజమనేది మున్ముందు తేలనుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణ జాతకం ప్రకారం గండం ఎప్పుడుందో తెలుసా, అందుకే ప్రాణం పోయినా ఆ పని చేయడు
Prasad Behera: ఇంతకన్నా నన్ను పీకేది ఏమీ లేదు.. ఆవేదనతో నటుడు ప్రసాద్ బెహరా తీవ్ర వ్యాఖ్యలు