అదిరిపోయిన నాని కొత్త సినిమా `సరిపోదా శనివారం` కాన్సెప్ట్ టీజర్‌.. వివేక్‌ ఆత్రేయలో ఈ యాంగిల్‌ ఎప్పుడూ చూడలే

Published : Oct 23, 2023, 12:06 PM ISTUpdated : Oct 23, 2023, 12:11 PM IST
అదిరిపోయిన నాని కొత్త సినిమా `సరిపోదా శనివారం` కాన్సెప్ట్ టీజర్‌..  వివేక్‌ ఆత్రేయలో ఈ యాంగిల్‌ ఎప్పుడూ చూడలే

సారాంశం

`దసరా` తర్వాత మరోసారి నానిని తనలోని ఊర మాస్‌ యాంగిల్‌ చూపిస్తున్నారు. వివేక్‌ ఆత్రేయతో కలిసి `సరిపోదా శనివారం` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేసింది టీమ్‌. 

నేచురల్‌ స్టార్‌ నాని.. మరోసారి వివేక్‌ ఆత్రేయతో కలిసి సినిమా చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే `అంటే సుందరానికి` చిత్రం వచ్చింది. అది డిజాస్టర్‌ అయ్యింది. ఇప్పుడు హిట్‌ కోసం కలిశారు. అయితే ఈ సారి ఊహించని జోనర్‌తో వస్తున్నారు. యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలతో మేళవించిన మూవీతో వస్తున్నారు. `దసరా` తర్వాత మరోసారి నానిని తనలోని ఊర మాస్‌ యాంగిల్‌ చూపిస్తున్నారు. వివేక్‌ ఆత్రేయతో కలిసి `సరిపోదా శనివారం` (Saripodhaa Sanivaaram) అనే చిత్రంలో నటిస్తున్నారు. 

ఈ సినిమా టైటిల్‌, కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేసింది టీమ్‌. ఇందులో సంకెళ్లతో ఓ రూమ్‌లో బంధించి ఉన్నారు నాని. సాయికుమార్‌ వాయిస్‌ ఓవర్‌లో.. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది, అప్పటి వరకు వెయిట్‌ చేయాలని పెద్దవాళ్లు చెప్పేవారు, కానీ ఇప్పటి తరం దాన్ని మార్చి నీ కంటూ ఓ టైమొస్తుందిరా, అందాక మూసుకుని వెయిట్‌ చేయు.. అని చెబుతున్నారు.ఇప్పుడిది ఆ మాట చెప్పిన ఆ తరం వాళ్ల గురించో, ఆ మాట మార్చిన ఈ తరం వాళ్ల గురించో కాదు, అప్పట్నుంచి ఇప్పటి వరకు ఏ తరం వారైనా, కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే ఆ ఒక్క రోజు గురించి. 

అలాంటి రోజు, ఆ ఒక్క రోజు, ఒకడికి వారికి ఒక్కసారి వస్తే, వాడిని ఎవరైనా ఆపాలనుకోగలరా?.. అనుకున్నా ఆపగలరా? శనివారం, ప్రతి శనివారం..సరిపోదంటారా? అని సాయి కుమార్ చెప్పగా, తన కట్లు తెంచుకుని, సంకెళ్లని పగలగొట్టుకుని ఓ వైపు వర్షం, మరోవైపు మంటల మధ్యలో నుంచి కట్టలు తెచ్చుకుని, డోర్లు పగలగొట్టుకుని బయటకు వచ్చాడు నాని. ఆయన కోసం ఊరి జనం మొత్తం వెయిట్‌ చేయడం, ఆయన్ని చూసి ఓ చిన్నారి పాప నవ్వడం ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించడంతోపాటు ఆకట్టుకుంటుంది. 

లవ్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్‌ ఆత్రేయ నుంచి ఇలాంటి జోనర్‌ని సినిమాని ఊహించడం కష్టం. మరి తనలోని కొత్త యాంగిల్‌ని ఆవిష్కరిస్తూ నానితో `సరిపోదా శనివారం` సినిమాని తెరకెక్కిస్తున్నారు వివేక్‌ ఆత్రేయ. విడుదల చేసిన టైటిల్‌, కాన్సెప్ట్ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీన్ని పాన్ ఇండియన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుండగా, ఎస్‌ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ శనివారం నుంచి షూటింగ్‌ స్టార్ట్ అవుతుందని చెప్పారు. డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?