మోక్షజ్ఞ షాకింగ్ లుక్.. నందమూరి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించేలా పుకార్లు!

Published : Jul 28, 2019, 03:18 PM IST
మోక్షజ్ఞ షాకింగ్ లుక్.. నందమూరి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించేలా పుకార్లు!

సారాంశం

బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడిస్తాడని నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ అప్పుడపుడు తళుక్కుమని మెరవడమే తప్ప మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. 

బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడిస్తాడని నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ అప్పుడపుడు తళుక్కుమని మెరవడమే తప్ప మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. ఇటీవల బాలయ్య, మోక్షజ్ఞ కలసి తూర్పు గోదావరిలో పుల్లేటికుర్ర వద్ద చాముండేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మీడియాకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా బాలయ్య, మోక్షజ్ఞ ఈ పూజలని రహస్యంగా చేశారు. బాలకృష్ణ ఈ పూజలు నిర్వహించడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ లీకైన ఫొటోలు, అతడి గురించి వస్తున్న పుకార్లు నందమూరి అభిమానులకు నిరాశ కలిగించే విధంగా ఉన్నాయి. 

మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని ప్రచారం జరుగుతోంది. అతడి ధ్యాసని సినిమాలపై మళ్లించేందుకు బాలయ్య ఈ పూజలు చేయించాడట. ఇక ఆలయం నుంచి లీకైన మోక్షజ్ఞ ఫోటో షాక్ ఇచ్చే విధంగా ఉంది. అతడి లుక్ చూసిన అభిమానులు.. మోక్షజ్ఞ ఇంకా సినిమాలకు రెడీ కాలేదా అని కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

బొమ్మరిల్లు సీక్వెల్ లో.. తండ్రీ కొడుకులుగా నటించబోయేది ఎవరో తెలుసా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు
Illu Illalu Pillalu: శుభకార్యం ఆపకపోతే ఫోటోలు బయట పెడతా.. శ్రీవల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విశ్వక్