రజనీ నిర్ణయంపై నగ్మా,కమల్ హాసన్ కామెంట్స్

By Surya PrakashFirst Published Dec 29, 2020, 7:05 PM IST
Highlights

రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ కోసం ఎదురు చూసిన అభిమానులందరికీ క్షమాపణ చెపుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్డు మీదకు వస్తే.. అది తన ఆరోగ్యానికే ముప్పుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయమై సినీ,రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. 
 


రాజకీయ పార్టీని పెట్టే ఆలోచనను విరమించుకుంటున్నానని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొత్త పార్టీ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ కోసం ఎదురు చూసిన అభిమానులందరికీ క్షమాపణ చెపుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్డు మీదకు వస్తే.. అది తన ఆరోగ్యానికే ముప్పుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయమై సినీ,రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. 

ఎమ్ ఎన్ ఎమ్ పార్టీ చీఫ్ కమల్ మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా తీసుకున్న నిర్ణయం తనను నిరాశపరిచింది అని అన్నారు. ఆయన్ను కలిసి త్వరలోనే మాట్లాడతానని చెప్పారు. తన నిర్ణయం మార్చుకోమని అడుగుతానని అన్నారు.

అలాగే రజనీ చేసిన ప్రకటనపై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్పందించారు. రజనీకాంత్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తాను ప్రశంసిస్తున్నానని ఆమె అన్నారు. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమైనదని అన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజల మేలు కోసం రజనీ పాటుపడాలని ఆకాంక్షించారు.

వాస్తవానికి ఈ నెల 31న కొత్త పార్టీని ప్రకటించనున్నామని రజనీ తెలిపారు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పార్టీని ప్రకటించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇటీవలే హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. తీవ్రమైన బీపీ హెచ్చుతగ్గులతో ఆయన బాధపడ్డారు. ఈ నేపథ్యంలో, ఎంతో ఒత్తిడి ఉండే రాజకీయాలు వద్దని ఆయన కుమార్తె ఐశ్వర్యతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఆయనను కోరారు. దీంతో, ఆయన పార్టీ పెట్టే యోచనను విరమించుకున్నారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల లేఖను విడుదల చేశారు. 

click me!