బిగ్ బాస్ 3: ఫుల్ జోష్ తో 'కింగ్' వచ్చేశాడు.. నాగార్జున తొలి పలుకులు!

By tirumala ANFirst Published Jun 28, 2019, 8:00 PM IST
Highlights

బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. కింగ్ నాగార్జున సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. బిగ్ బాస్ 3 షో కోసం స్టార్ మా సంస్థ తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది.

బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. కింగ్ నాగార్జున సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. బిగ్ బాస్ 3 షో కోసం స్టార్ మా సంస్థ తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో నాగార్జున తొలి పలుకులు వినిపిస్తూ.. ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ 3 కి సంబంధించిన కొంత సమాచారాన్ని అందించారు. 

రద్దీగా ఉండే మార్కెట్ లో జనాలంతా ఆశ్చర్యంతో చూస్తుండగా నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. ' ఏంటి గుడ్లప్పగించి చూస్తున్నావ్.. గుడ్లు ఇవ్వు.. డజనా రెండు డజన్లా సర్.. ఆకలేస్తే తింటారు.. అలిగితే వాటితోనే కొట్టుకుంటారు.. అన్నీ ఇచ్చేయ్ అని నాగార్జున అడుగుతాడు. మరో కూరగాయల దుకాణానికి వెళ్లి.. నవనవలాడే లేత వంకాయలు పాతిక కిలోలు ఇవ్వు అని అడుగుతాడు. పాతిక కిలోలా అంటూ దుకాణం యజమానురాలు ఆశ్చర్యపోతుంది. ఎక్కడికండి అని అడుగుతుంది.. వంకాయల్లాగా వగలుబోయేవాళ్లు ఉంటారే అక్కడికి అని నాగ్ సమాధానం ఇస్తాడు. 

మరో దుకాణంలో.. మంచి క్వాలిటీ రైస్.. ఓ బస్తా ఇమ్మంటారా అని అడుగుతాడు.. 14 మంది.. 100 రోజులు 1 బస్తా ఏం సరిపోతుంది.. అన్ని ఇచ్చేయ్ అని నాగ్ అంటాడు. ఈ సారి నేనే రంగంలోకి దిగుతున్నా అని నాగ్ అంటాడు. ఈ ప్రోమో ద్వారా బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్స్ 14మంది ఉండబోతున్నారనే విషయం అర్థం అవుతోంది. 100 రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. కంటెస్టెంట్స్ ఎవరనే విషయం త్వరలోనే వెల్లడిస్తారు. 

 

Eesari rangamloki digedi mana as Host!!! 👑👁️

Coming soon on https://t.co/faTrmUDVJ8

— STAR MAA (@StarMaa)
click me!