వాసివాడి తస్సాదియ్యా.. నాగార్జున ఈ మూవీ చేస్తే ఉంటది, మలయాళీ మాస్ హిట్ పై కింగ్ కన్ను

Published : Mar 09, 2023, 09:03 PM IST
వాసివాడి తస్సాదియ్యా.. నాగార్జున ఈ మూవీ చేస్తే ఉంటది, మలయాళీ మాస్ హిట్ పై కింగ్ కన్ను

సారాంశం

ఇటీవల బంగార్రాజు మినహా కింగ్ నాగార్జునకి సరైన చిత్రం పడలేదు. వైల్డ్ డాగ్, ఘోస్ట్ అంటూ ఆయన చేసిన కాప్ స్టోరీలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నాగార్జున నిఖార్సైన మాస్ మూవీ చేసి చాలా కాలమే అవుతోంది. 

ఇటీవల బంగార్రాజు మినహా కింగ్ నాగార్జునకి సరైన చిత్రం పడలేదు. వైల్డ్ డాగ్, ఘోస్ట్ అంటూ ఆయన చేసిన కాప్ స్టోరీలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నాగార్జున నిఖార్సైన మాస్ మూవీ చేసి చాలా కాలమే అవుతోంది. ఇదిలా ఉండగా ఈ తరుణంలో నాగార్జున తదుపరి చిత్రంపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 

నాగార్జున తన తదుపరి చిత్రం కోసం మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019లో విడుదలైన మలయాళీ చిత్రం 'పోరింజు మరియం జొస్' మాస్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తన బాడీ లాంగ్వేజ్ కి బాగా సెట్ అవుతుందని నాగార్జున భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే నిర్మించాలనుకున్నారట.      

కానీ ఈ చిత్ర రీమేక్ హక్కులని అభిషేక్ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు అభిషేక్ పిక్చర్స్ అఫీషియల్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. అయితే నాగార్జునతో ఈ చిత్రం చేస్తున్నట్లు అభిషేక్ సంస్థ ప్రెస్ నోట్ లో పేర్కొనలేదు. ఒక స్టార్ హీరోతో ఈ చిత్రం చేస్తున్నాం అని మాత్రం ప్రకటించారు.          

దీనిపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున పోరింజు మరియం జొస్ రీమేక్ చేయడం ఖాయమే అయినప్పటికీ దర్శకుడుకి విషయంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  ధమాకా, నేను లోకల్ చిత్రాలతో రచయితగా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రసన్న కుమార్ దర్శకుడిగా డెబ్యూ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తన నెక్స్ట్ చిత్రంతోనే దర్శకుడిగా అవకాశం ఇస్తానని నాగార్జున మాట ఇచ్చారట. పోరింజు మరియం జొస్ రీమేక్ కి నాగార్జున ప్రసన్న కుమార్ పేరు ప్రతిపాదించారట. కానీ నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏది ఏమైనా ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున ఈ చిత్రం చేస్తే వాసివాడి తస్సాదియ్యా మాస్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అని అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.                                                                                   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా