'అల'తో వచ్చిన పేరు 'వి' తో పోగొట్టుకున్న థమన్

By Satish ReddyFirst Published Sep 6, 2020, 8:55 AM IST
Highlights

నాని హీరోగా నిన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన వి మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. కాగా వి మూవీకి బీజీఎమ్ అందించిన థమన్ నెటిజెన్స్ కి దొరికిపోయారు. వి మూవీ బీజీఎమ్ కాపీ అంటూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

బన్నీ-త్రివిక్రమ్ ల సంక్రాంతి చిత్రం అల వైకుంఠపురంలో సెన్సేషనల్ హిట్ అందుకుంది. భారీ వసూళ్లు సాధించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. ఐతే ఈ చిత్ర విజయంలో థమన్ సాంగ్ కీలక పాత్ర పోషించాయి. కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. యూట్యూబ్ లో ఈ సాంగ్స్ వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్నాయి. అల వైకుంఠపురంలో సాంగ్స్ మేనియా బాలీవుడ్ వరకు పాకింది. 

అల వైకుంఠపురంలో ఆ స్థాయి విజయం సాధించడానికి పాటలు కూడా ఒక కారణం అనడంలో అతిశయోక్తి లేదు. అల వైకుంఠపురంలో సాంగ్స్ తో తన క్రేజ్ విపరీతంగా పెంచేసుకున్న థమన్ స్టార్ హీరోల నుండి భారీ ఆఫర్స్ దక్కించుకున్నాడు. మహేష్ సర్కారు వారి పాట, పవన్ వకీల్ సాబ్, బాలయ్య-బోయపాటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఉన్నారు. కాగా నిన్న విడుదలైన వి మూవీ బీజీఎమ్ థమన్  ఇమేజ్ ని బాగా దెబ్బ తీసింది. వి సినిమాకు థమన్ కేవలం నేపధ్య సంగీతం అందించారు. 

ఈ మూవీ విడుదలైన నాటి నుండి థమన్ పై సోషల్ మీడియా దాడి పెరిగిపోయింది. వి నేపథ్య సంగీతం అనేక చిత్రాల బీజీఎమ్ తో పోలి ఉన్న తరుణంలో ఆయనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అనేక రకాల మీమ్స్ తో ఒక ఆటాడుకుంటున్నారు. నిన్నటి నుండి నెటిజెన్స్ దీనిపైనే ఫోకస్ పెట్టారు. మరో ప్రక్క అల వైకుంఠపురంలో మూవీతో వచ్చిన ఇమేజ్ ని వి మూవీతో థమన్ పాడుచేసుకున్నాడన్న టాక్ వినిపిస్తుంది. 
 

click me!