షాకింగ్‌: కరోనాతో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ మృతి

By Satish Reddy  |  First Published Jun 1, 2020, 8:43 AM IST

బాలీవుడ్‌ యువ సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌ కరోనాతో మృతి చెందాడు. ఆయన వయసు 42 ఏళ్లు మాత్రమే. సల్మాన్‌ ఖాన్‌కు పలు సూపర్‌  హిట్ పాటలను అందించిన ఆయన చిన్న వయసులోనే మృతి చెందటం పట్ల సినీ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


కరోనా సినీ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సినీ కార్యకలాపాలు ఆగిపోవటంతో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. వేలది కుటుంబాలు ఉపాది లేక ఆకలితో ఆలమటిస్తున్నాయి. ఇది చాలదన్నట్టుగా సినీ ప్రముఖులకు కూడా కరోనా సోకతుండటంతో ఇండస్ట్రీ వర్గాలు కలవరపడుతున్నాయి. గాయని కనికా కపూర్‌కు కరోనా సోకటంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ ఉలిక్కి పడింది.

ఆ తరువాత నిర్మాత కరీం మొరానీ, ఆయన ఇద్దరు కూతుళ్లకు సోకటం, తరువాత బోని కపూర్‌ ఇంట్లో ముగ్గురు పని వారకి కరోనా సొకటం, తాజాగా కరణ్‌ జోహార్‌ ఇంట్లో కూడా కరోనా సోకినట్టుగా వార్తలు రావటంతో ఇండస్ట్రీ వర్గాలు భయపడుతున్నారు. తాజాగా మరో వార్త ఇండస్ట్రీ వర్గాలను విషాదంలోకి నెట్టింది. దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు వాజిద్‌ ఖాన్‌ కరోనాతో మృతి చెందాడు. అది వయసు కేవలం 42 సంవత్సరాలు మాత్రమే.

Latest Videos

చిన్న వయసులోను వాజిద్ మరణించటంతో ఇండస్ట్రీ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాజిత్ వాజిద్‌ ద్వయం ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అయితే వాజిద్‌ కొంత కాలంగా కిడ్నీకి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ కూడా జరిగింది. సల్మాన్‌ ఖాన్‌కు ఎన్నో సూపర్‌ హిట్ సాంగ్స్‌ను అందించాడు వాజిద్. ఇటీవా భాయ్ భాయ్‌ అంటూ సాగే పాటను కూడా వాజిద్‌ కంపోజ్‌ చేశాడు.

వాజిద్‌ మరణ వార్తను మరో సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌ ధృవీకరించారు. కొద్ది రోజుల క్రితం వాజిద్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలటంతో ఆయన్ను ముంబైలోని సురానా హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యపరంగా ఉన్న ఇతర కాంప్లికేషన్స్‌ కారణంగా పరిస్థితి విషమించి వాజిద్‌ మరణించినట్టుగా సన్నిహితులు వెల్లడించారు.

click me!