విజయదేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యం.పీ. కవిత (వీడియో)

Published : Aug 24, 2018, 10:37 AM ISTUpdated : Sep 09, 2018, 11:02 AM IST
విజయదేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యం.పీ. కవిత  (వీడియో)

సారాంశం

ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం హిట్ టాక్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చాలా బాగుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా చిత్ర యూనిట్ ని ప్రశంసలతో ముంచెత్తారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని కవిత నివాసానికి ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం, నిర్మాత బన్నీవాసు వెళ్లి కలిశారు. తాను గీతగోవిందం సినిమాను రెండు సార్లు చూసినట్టు కవిత వెల్లడించారు. సినిమా చూశారా? ఎలా ఉంది? అని కవితను విజయ్ దేవరకొండ అడగ్గా.. ‘మస్తుంది సినిమా.. మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా’ అని నవ్వుతూ తెలిపారు.   ‘మీరు ఈ సినిమా చూస్తారని, మమ్మల్ని ఇలా అభినందిస్తారని అసలు ఊహించలేదు’ అని కవితతో చెప్పిన బన్నీ వాస్ సంతోషం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఆ హీరోతో మళ్లీమళ్లీ చేయాలనిపిస్తుంది.. ఇంతకీ దిల్ రాజు చెప్పిన అతడెవరో తెలుసా
100 కోట్ల ఇల్లు, 80 కోట్ల ఫ్లైట్, 12 కోట్ల కార్లు, అల్లు అర్జున్ రాయల్ లైఫ్ స్టైల్ చూస్తే కళ్లు తిరగాల్సిందే