Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి.. బొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

Published : Dec 25, 2023, 11:04 PM IST
Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి.. బొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi తాజాగా కలిశారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇండస్ట్రీలో పెద్దగానూ వ్యవహరిస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలను ముందుండి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఈరోజు మర్యాదపూర్వకరంగా కలిశారు. 

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకరం చేసిన అనంతరం ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఇక ఇండస్ట్రీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలిపిన విషయం చేసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డిని తన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎంతో భేటీ అయ్యారు. చాలా సమయం మాట్లాడారు. చిత్ర పరిశ్రమ గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీలోని పలు సమస్యలను చిరు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిని ఈరోజు యంగ్ హీరో తేజా సజ్జా కలిసి బొకే అందించారు. 

ఇక చిరు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో Mega156లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫాంటసీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మూవీ సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత