ఇంగ్లీషు పిల్లతో మన్మథుడి రొమాన్స్.. ఆకట్టుకుంటున్న తొలి పాట!

Published : Jul 21, 2019, 08:28 PM ISTUpdated : Jul 22, 2019, 09:49 AM IST
ఇంగ్లీషు పిల్లతో మన్మథుడి రొమాన్స్.. ఆకట్టుకుంటున్న తొలి పాట!

సారాంశం

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయక. ఆగష్టు 9న రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. 

కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది. 17 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన మన్మథుడు చిత్రానికి ఇది సీక్వెల్. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. 

తాజాగా చిత్ర యూనిట్ మన్మథుడు 2లోని తొలి పాటని విడుదల చేశారు. 'హే మానియా' అంటూ సాగే ఈ పాట ట్రెండీగా ఉంటూ ఆకట్టుకుంటోంది. నాగార్జున స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియో సాంగ్ లో నాగార్జున ఇంగ్లీషు భామలతో రొమాన్స్ అదరగొట్టేశాడు. 

రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగార్జున, రకుల్ పాత్రలని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

 

PREV
click me!

Recommended Stories

Jailer 2 19 Days Box Office: భారీగా పడిపోయిన జైలర్‌ 2 కలెక్షన్లు.. కోలీవుడ్ కి వెయ్యి కోట్లు ఇక కలేనా?
Ramu Rathod: యూట్యూబ్ ను ఊపు ఊపేసిన రాము రాథోడ్ టాప్ 3 ఫోక్ సాంగ్స్.. 100 కోట్ల వ్యూస్ కు దగ్గరగా ఉన్న పాట ఇదే..