`మంగళవారం` థియేట్రికల్‌ బిజినెస్‌ లెక్కలు.. వామ్మో ఇదేం క్రేజ్‌

Published : Oct 31, 2023, 04:52 PM ISTUpdated : Oct 31, 2023, 05:02 PM IST
`మంగళవారం` థియేట్రికల్‌ బిజినెస్‌ లెక్కలు.. వామ్మో ఇదేం క్రేజ్‌

సారాంశం

హిట్‌ కోసం దర్శకుడు, హీరోయిన్‌ పాయల్‌ కలిశారు. పాయల్‌ ప్రధాన పాత్రలో `మంగళవారం` చిత్రాన్ని రూపొందించాడు అజయ్‌ భూపతి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 

అజయ్‌ భూపతి దర్శకుడిగా పరిచయమైన `ఆర్‌ఎక్స్ 100` చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమాతో హీరో కార్తికేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. హీరోహీరోయిన్లతోపాటు దర్శకుడు కూడా పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత వీరికి ఒక్క హిట్‌ కూడా రాలేదు. అటు కార్తికేయ స్ట్రగులింగ్‌లోనే ఉన్నాడు, బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరోవైపు పాయల్‌ కి సైతం హిట్‌ లేదు. దర్శకుడు అజయ్‌ భూపతి చేసిన రెండో మూవీ `మహాసముద్రం` కూడా డిజప్పాయింట్‌ చేసింది. 

ఇక హిట్‌ కోసం దర్శకుడు, హీరోయిన్‌ పాయల్‌ కలిశారు. పాయల్‌ ప్రధాన పాత్రలో `మంగళవారం` చిత్రాన్ని రూపొందించాడు అజయ్‌ భూపతి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. హర్రర్‌ ఎలిమెంట్లతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ట్రైలర్‌ గూస్‌ బమ్స్ తెప్పించేలా ఉంది. అదే సమయంలో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. 

అయితే ఇప్పుడు ఈ మూవీ బిజినెస్‌ కూడా షాకిస్తుంది. ఈ మూవీ ఈ నెల 17న రిలీజ్‌ కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ట్రైలర్ కి అన్ని భాషల్లో మంచి స్పందన లభించింది. స్పందనే కాదు బిజినెస్‌ కూడా బాగుందని తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రం సుమారు రూ.15 కోట్ల బిజినెస్‌ చేసిందని తెలుస్తుంది. 

నైజాంలో ఈ మూవీని దిల్‌రాజు రూ.3.40కోట్లకు తీసుకున్నారట. ఆంధ్ర, సీడెడ్‌లో రూ.7.20కోట్లకు అమ్ముడు పోయిందట. మరోవైపు ఇతర స్టేట్స్, ఓవర్సీస్‌ కలుపుకుని మొత్తంగా రూ.15కోట్లకు పైగానే బిజినెస్‌ జరిగిందని టాక్‌. ఇక ఈ సినిమాకి సుమారు రూ.18కోట్ల బడ్జెట్‌ అయ్యిందని తెలుస్తుంది. ఈ లెక్కన బడ్జెట్‌కి చాలా దగ్గరగానే బిజినెస్‌ కావడం విశేషం. ఓటీటీ రూపంలో మరో ఐదారుకోట్లు రావచ్చు. ఈ లెక్కన ఇది రిలీజ్‌కి ముందే ప్రాఫిట్‌లో ఉండబోతుంది. ఇటీవల కాలంలో ఒక చిన్న సినిమా ఈ రేంజ్‌ బిజినెస్‌ కావడం గొప్ప విషయంగా చెప్పొచ్చు. 

అయితే కంటెంట్‌ ఉన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు ఉన్న మూవీస్‌ మంచి ఆదరణ పొందుతున్నాయి. బడ్జెట్‌ తక్కువగా ఉండటం కూడా ఇలాంటి చిత్రాలకు కలిసొచ్చే అంశాలు. అలా `మంగళవారం` కూడా ఆ కోవకే చెందే మూవీలా కనిపిస్తుంది. మరి థియేటర్లలో ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?