బికినీ వీడియో షేర్ చేసిన నటి.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

Published : May 16, 2019, 12:19 PM IST
బికినీ వీడియో షేర్ చేసిన నటి.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

సారాంశం

బిగ్ బాస్ షో మాజీ కంటెస్టంట్, బాలీవుడ్ నటి మందానా కరిమీ రంజాన్ మాసంలో బికినీ వేసుకొని దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

బిగ్ బాస్ షో మాజీ కంటెస్టంట్, బాలీవుడ్ నటి మందానా కరిమీ రంజాన్ మాసంలో బికినీ వేసుకొని దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన మందానా కరిమీ ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తూ మోడలింగ్ నుండి సినీ నటి అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచి పాపులర్ అయ్యారు. తాజాగా ఈ బ్యూటీ తన బికినీ ఫోజులతో కూడిన వీడియోను షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.

రంజాన్ మాసంలో ఇలాంటి వీడియోలు షేర్ చేయడం సిగ్గుచేటు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరొక నెటిజన్ నీ కంటే బిక్షగాళ్ల వద్ద మంచి దుస్తులున్నాయని కామెంట్ చేశారు. అయితే కొందరు మాత్రం మందానాకి మద్దతు తెలుపుతున్నారు.

సినిమాల విషయానికొస్తే.. ఈమె  'ఫఘ్ జానీ', 'కాయా కూల్ హైన్', 'హమ్ 3' వంటి చిత్రాల్లో నటించింది. రెండేళ్ల క్రితం బిజినెస్ మెన్ గౌరవ్ గుప్తాను వివాహం చేసుకున్న తరువాత వారి మధ్య విభేదాలు రావడంతో పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా