మాలీవుడ్‌లో మరో విషాదంః రైటర్‌ కరోనాతో కన్నుమూత

By Aithagoni RajuFirst Published May 11, 2021, 5:06 PM IST
Highlights

కరోనాతో జాతీయ అవార్డు రైటర్‌ కన్నుమూశారు. `కరుణమ్‌` చిత్రానికి ఉత్తమ స్క్రిప్ట్ రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్న రైటర్, నటుడు మాడంపు కుంజు కుట్టన్‌(81) కన్నుమూశారు. 

విషాదంః మలయాళంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో జాతీయ అవార్డు రైటర్‌ కన్నుమూశారు. `కరుణమ్‌` చిత్రానికి ఉత్తమ స్క్రిప్ట్ రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్న రైటర్, నటుడు మాడంపు కుంజు కుట్టన్‌(81) కన్నుమూశారు. ఇటీవల కోవిడ్‌19 లక్షణాలు కనిపించడంతో త్రిశూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో మాలీవుడ్‌ మరోసారి షాక్‌కి గురయ్యింది. 

సోమవారం రాత్రి మరో రైటర్‌,దర్శకుడు డెన్నీస్‌ జోసెఫ్‌ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి బయటపడకముందే మరో విషాదం చోటు చేసుకుంది. దీంతో మాలీవుడ్‌ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఇక త్రిశూర్‌ జిల్లాలోని కిరలూర్‌కి చెందిన మాడంపు కుంజికుట్టన్‌ అసలు పేరు శంకరన్‌ నంబూద్రి. అనేక మలయాళ చిత్రాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశారు. పలు సినిమాల్లో కూడా నటించారు. 2000లో జయరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన `కరుణమ్‌` చిత్రానికి ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ గా జాతీయ అవార్డుని అందుకున్నారు. మకాల్కు, గౌరీశంకరం, సఫలం, కరుణం, దేశదానం వంటి సినిమాలకు స్క్రిప్ట్ రాశారు. సాహిత్య , సినీ లోకం మడంపు అని ప్రేమగా పిలిచుకునే  కుంజుకుట్టన్ 10 కి పైగా నవలలు రాశారు. `పైత్రికం`, `వడక్కున్నాథన్`‌, `కరుణమ్`, `దేశదానం`, `ఆరంతాంపురం` సినిమాల్లో నటుడిగానూ నటించి ఆకట్టుకున్నారు. 
 

click me!