#Premalu: 3 కోట్లు బడ్జెట్,10 రోజుల్లో 42 కోట్లు , ఎందుకింత పెద్ద హిట్

By Surya PrakashFirst Published Feb 19, 2024, 3:53 PM IST
Highlights

 ఈ మూవీకి మన హైదరాబాద్ కూ లింకు ఉండటం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం. 


డల్ సీజన్ లో మలయాళం సినిమా కుమ్మేస్తోంది. ఓ ప్రక్కన భ్రమయుగం, మరో ప్రక్క ప్రేమలు చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. సాధారణంగా మళయాళం సినిమాలు అంటే తక్కువ బడ్జెట్ తో ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  తాజాగా ఇప్పుడు మరో మలయాళ మూవీ వచ్చింది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ప్రేమలు అనే మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరకొడుతోంది. 

  వాలెంటైన్స్ డేకు కానుకగా  రిలీజైన ఈ ప్రేమలు బడ్జెట్ కేవలం రూ.3 కోట్లు. కానీ మొదటి వారంలోనే ఈ సినిమా రూ.18 కోట్ల వరకూ వసూలు చేసేసింది. అలాగే పది రోజుల్లో ఈ చిత్రం 41.05cr గ్రాస్ వచ్చింది. అలాగే ఈ సినిమా మన తెలుగు వాళ్లకు కూడా కనెక్ట్ అవుతుంది.  ఈ మూవీకి మన హైదరాబాద్ కూ లింకు ఉండటం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం. హైదరాబాద్  బ్యాక్ డ్రాప్ లో సాగే అందమైన లవ్ స్టోరీ ఈ ప్రేమలు. 

Latest Videos

గిరీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నస్లేన్ గఫూర్, మమితా బైజూ లీడ్ రోల్స్ లో నటించారు. చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లాలని కలలు కనే యువకుడు.. భవిష్యత్తులో ఎలా సెటిల్ అవ్వాలి అనిక్లారిటీ ఉన్న సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన యువతి మధ్య సాగే ప్రేమ కథ ఇది. యూత్ ని ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేమలు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది.

స్టోరీ లైన్ విషయానికి వస్తే... ఓ పెళ్లిలో పరిచయమైన హీరోహీరోయిన్లు తర్వాత ఎలా ప్రేమలో పడతారు? ఆ ప్రేమ ఆ అబ్బాయి గేమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కు, ఆ అమ్మాయి భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఎలాంటి అడ్డంకులు ఇబ్బందులు  చేస్తుందన్నది ఈ ప్రేమలు మూవీ స్టోరీ.   ఈ చిత్రం ప్రస్తుతం కేవలం మలయాళంలోనే ఈ సినిమా రిలీజైంది. తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తే ప్రేమలు మూవీ హిట్ కావడం ఖాయంగా అంటున్నారు. అయితే రీమేక్ చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. 
 

click me!