ఆర్మీ ఆఫీసర్ గా మహేష్.. ఫోటో లీక్!

By AN TeluguFirst Published Jul 8, 2019, 11:47 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ షూటింగ్ లో మహేష్ బాబు కూడా జాయిన్ అయ్యాడు.

ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఆ గెటప్ లో మహేష్ ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది. ఇప్పుడు ఆ గెటప్ కి సంబంధించి  ఓ ఫోటో లీక్ అయింది. షూటింగ్ లొకేషన్ లో మహేష్ మిలిటరీ దుస్తులు ధరించి తన తోటి ఉద్యోగులతో ఏదో చర్చిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. 

ఈ ఫోటోలో మహేష్ పక్కన రాజేంద్రప్రసాద్ కూడా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన్నా కనిపించనుంది. 

సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

click me!