గుంటూరు కారం పాటకు సితార పాప స్టెప్పులు, వైరల్ అవుతున్న వీడియో..

By Mahesh Jujjuri  |  First Published Jan 21, 2024, 1:02 PM IST

సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుది. . పదేళ్ల నుంచే తన సోంత ఇమేజ్ ను క్రియేటు చేసుకుంది ఈ స్టార్ కిడ్. తాజాగా సోషల్ మీడియాలో దడదడలాడిస్తున్న సితార.. రీసెంట్ గా ఓ డాన్స్ వీడియోతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. 


సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా కాకుండా.. తన సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉంది సితార పాప. ఇప్పటికే నెటింట లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న సితార. తన  టాలెంట్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. . సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

మహఏష్ బాబుతో కలిసి మంచి పనుల్లో తన వంతుగా వాలెంటరీగా చేస్తూ.. తండ్రికితగ్గ తనయ అనిపించకుంటుంది. ఇక సితార ఎక్కువగా డాన్స్ వీడియోలు, తన ఇంట్లో జరిగిన పండగ సెలబ్రేషన్స్ ను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది.ఇన్ స్టా తో పాటు సితారకు సోంతంగా య్యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో ఆమె పెట్టే వీడియోలకు భారీగా రెస్పాన్స్ వస్తుంటుంది.  తాజాగా సితార వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

Latest Videos

సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. సితార పాప పోస్టులు చూస్తుంటే తండ్రికి తగ్గ తనయురాలు అనిపిస్తూ ఉంటుంది. భవిష్యత్‌లో హీరోయిగా మంచి పేరు తెచ్చుకుంటుందని అనిపిస్తూ ఉంటుంది. తన వీడియోలు చూసి మహేష్ అభిమానులు వావ్ అంటుంటారు. రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ సినిమాలోని పాటకి సితార వేసిన స్టెప్పులు చూసి మహేష్ బాబు అభిమానులు ముచ్చటపడుతున్నారు. గుంటూరు కారం’ సినిమాలోని ‘ట్రిప్పింగ్..ట్రిప్పింగ్’ పాటకి సితార వేసిన స్టెప్పులు అదరహో అనిపిస్తున్నాయి.

ఇటీవల మహేష్ ఇంట్లో జరిగిన ‘గుంటూరు కారం’ సక్సెస్ పార్టీలో కూడా సితార స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. టీమ్ అందరితో సందడి చేసింది. చాలా చిన్న వయసులోనే యూ ట్యూబ్ ఛానల్ రన్ చేయడంతో పాటు ఓ జ్యయలరీ సంస్ధకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సితార ఇంతవరకు ఏ స్టార్ కిండ్ అందుకోని బంపర్ ఆఫర్ అందుకుంది. సితార లేటెస్ట్ వీడియోలో స్టెప్పులు చూసిన మహేష్ అభిమానులు.. లైక్ ఫాదర్.. లైక్ డాటర్ అని.. సితార యూ ఆర్ సో అడోరబుల్ అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.

click me!