స్లోనే కానీ స్టడీ : తెలుగు రాష్ట్రాల్లో ‘మ‌హ‌ర్షి’ వీకెండ్ కలెక్షన్స్

By AN TeluguFirst Published May 13, 2019, 9:19 AM IST
Highlights

టాక్ కాస్త అటూ ఇటూ గా ఉన్నా  ‘మ‌హ‌ర్షి’భాక్సాఫీస్ వద్ద భారీగానే డబ్బులు దండుకుంటున్నాడు. 

టాక్ కాస్త అటూ ఇటూ గా ఉన్నా  ‘మ‌హ‌ర్షి’భాక్సాఫీస్ వద్ద భారీగానే డబ్బులు దండుకుంటున్నాడు. ఈ సినిమాకు పోటీగా భాక్సాఫీస్ దగ్గర మరో సినిమా పోటీ లేకపోవటం కూడా కలిసి వస్తోంది. దాంతో వీకెండ్ లలో పట్టు వదలకుండా స్టడీగానే ఉన్నాడు. తొలి రోజు కలెక్షన్స్ అంత కాకపోయినా రెండు, మూడో రోజు చెప్పుకోదగ్గ వసూళ్లనే తెచ్చుకున్నాడు. మూడో రోజు సైతం  ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 8.8 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చాడు.   ఈ నేపధ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో పరిస్దితి ఏమిటో చూద్దాం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలోనూ మూడు రోజుల్లోనూ దాదాపు నలభై కోట్లు వరకూ మహర్షి కలెక్ట్ చేసాడు. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా బాగా స్ట్రాంగ్ గా ఉండటం కలిసివచ్చే అంశం. 

సినిమాకు ప్లాఫ్ టాక్ రాకపోవటం, వేసవి శెలవులు ఈ సినిమా కలెక్షన్స్ కు బాగా బూస్ట్ గా పనిచేస్తున్నాయి. టాక్ అంత గొప్పగా లేకపోయినా ఈ స్దాయి కలెక్షన్స్ తేవటం అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు దిల్ రాజు టీమ్ ..ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తోంది. మొత్తం లెక్కలు తేలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్    యాభై కోట్లు షేర్  వచ్చి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. 

మహేష్ బాబు హీరోగా  నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9న వరల్డ్ వైడ్ గా విడుదలయింది. రైతుల సమస్యల ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్, జగపతి బాబు, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 

click me!