హే.. భాస్కర్! మరో బొమ్మరిల్లా?

By Prashanth MFirst Published Feb 18, 2019, 3:00 PM IST
Highlights

టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న యువ దర్శకుల్లో ఒకప్పుడు భాస్కర్ కూడా ఉన్నాడు. బొమ్మరిల్లు అనగానే భాస్కర్ గుర్తొస్తారు. అంత మంచి సినిమా చేసి ఇప్పుడు కనుమరుగైపోయిన ఆ పరుగు దర్శకుడి పేరు అప్పుడపుడు వార్తల్లో వినిపిస్తోంది గాని డైరెక్ట్ గా మీడియా ముందుకు రావడం లేదు. 

ఇకపోతే చాలా కాలం తరువాత అఖిల్ సినిమాకు సంబందించిన డిస్కర్షన్స్ లో భాస్కర్ పేరు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ బొమ్మరిల్లు - పరుగు వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం ఆరెంజ్ లాంటి కథతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఆ తరువాత రామ్ తో ఒంగోలు గిత్త - తమిళంలో బెంగుళూరు నాట్కళ్ మరింత డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ దెబ్బతో భాస్కర్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్య దిల్ రాజుతో స్టోరిల గురించి డిస్కస్ చేసినప్పటికీ భాస్కర్ కొత్త సినిమాలు పట్టాలెక్కలేదు. 

అయితే ఇప్పుడు పరుగు - బొమ్మరిల్లు లాంటి ఫ్యామిలీ కి సంబందించిన మెస్సేజ్ ఇచ్చే కంటెంట్ తో కథ రెడీ చేయమని సలహాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ కోసం కూడా ఒక ఫ్యామిలీ కథను సెట్ చెస్ట్ బెటర్ అని కథ నచ్చితే వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లవచ్చని నిర్మాతల సైడ్ నుంచి కూడా మనోడికి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ కథ కాకపోయినా వేరే కథతో అయినా ఈ ఏడాది మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.  

click me!