'అవతార్' సీక్వెల్స్ పై లేటెస్ట్ అప్డేట్!

Published : Oct 23, 2018, 04:43 PM IST
'అవతార్' సీక్వెల్స్ పై లేటెస్ట్ అప్డేట్!

సారాంశం

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను మెప్పించిన చిత్రం 'అవతార్'. ఇలాంటి ఒక అధ్బుతాన్ని మరోసారి చూడగలమా.. అనేంతగా దర్శకుడు జేమ్స్ కెమరూన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ గ్రహంలో జీవించే ఒక తెగ.. తమ జీవన విధానం, తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం పోరాడే కథతో ఈ సినిమాను రూపొందించారు.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను మెప్పించిన చిత్రం 'అవతార్'. ఇలాంటి ఒక అధ్బుతాన్ని మరోసారి చూడగలమా.. అనేంతగా దర్శకుడు జేమ్స్ కెమరూన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఓ గ్రహంలో జీవించే ఒక తెగ.. తమ జీవన విధానం, తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం పోరాడే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'అవతార్ 2', 'అవతార్ 3' సినిమాలు వస్తున్నాయి. ఈ సీక్వెల్స్ పై నిర్మాత జోన్ లాండూ తాజా అప్డేట్స్ అందించారు.

''రెండు సినిమాల చిత్రీకరణ ఏకకాలంలో జరుగుతోంది. ముఖ్యంగా నటీనటులకి సంబంధించిన పెర్ఫార్మన్స్ చిత్రీకరణ పూర్తయింది. అవతార్ 2, 3 సీక్వెల్స్ తో పాటు 4, 5 సినిమాలకి సంబంధించిన పనులు సైతం నడుస్తున్నాయి'' అంటూ వెల్లడించారు. 

అవతార్ 2 సినిమాని డిస్నీ, ఫాక్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా ప్రకటించినట్లు డిసంబర్ 18, 2020 కాకుండా మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు హాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?