'లక్ష్మీస్ ఎన్టీఆర్' మరోసారి వాయిదా..?

Published : Mar 16, 2019, 04:39 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' మరోసారి వాయిదా..?

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా పడుతుందని అనుకున్నారు.

కానీ ఎలెక్షన్ కమిషన్ సినిమాను అడ్డుకోవడం కుదరదని చెప్పడంతో సినిమా అనుకున్నట్లుగా ఈ నెల 22న వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు సినిమా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

సెన్సార్ జనాలు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. మరో ఆరురోజుల్లో సినిమా రిలీజ్, కానీ ఇలాంటి పరిస్థితుల్లో సెన్సార్ అడ్డు తగులుతోంది.

దీన్ని అధిగమించడానికి దర్శకనిర్మాతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ సినిమా మాత్రం వచ్చే వారం రాదనేది స్పష్టం అవుతోంది. మరో వారం వెనక్కి జరిగి మార్చి 29న రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు