అదే నీ పెద్ద శత్రువు... సుశాంత్ పై కృతి ఎమోషనల్ పోస్ట్

Published : Jun 17, 2020, 08:12 AM IST
అదే నీ పెద్ద శత్రువు... సుశాంత్ పై కృతి ఎమోషనల్ పోస్ట్

సారాంశం

తాజాగా మంగళవారం సాయంత్రం కృతి తన బాధనంతటినీ ఓ పోస్టులో తెలియజేసింది. ఆ పోస్టు చూసిన తర్వాత.. సుశాంత్ మృతి పట్ల ఆమె ఎంత బాధపడిందో అందరికీ అర్థమయ్యింది.  

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం అందరినీ కలచివేసింది. ఆయన ఆత్మహత్య తో బాలీవుడ్ నటులంతా ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో.. సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. కాగా.. సుశాంత్ మృతి పట్ల ఆయన గర్ల్ ఫ్రెండ్ కృతి సనన్ స్పందించడం లేదని.. కనీసం ఒక్క పోస్టు కూడా పెట్టలేదని ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు.

ఆ తర్వాత సుశాంత్ అంత్యక్రియలకు పాల్గొన్న ఫోటోలు చూసి... కాస్త శాంతించారు. అయితే.. తాజాగా మంగళవారం సాయంత్రం కృతి తన బాధనంతటినీ ఓ పోస్టులో తెలియజేసింది. ఆ పోస్టు చూసిన తర్వాత.. సుశాంత్ మృతి పట్ల ఆమె ఎంత బాధపడిందో అందరికీ అర్థమయ్యింది.

 

‘‘సుశ్.. నాకు తెలుసు.. నీ బ్రెయిన్ నీ బెస్ట్ ఫ్రెండ్. అదే నీ అత్యంత పెద్ద శత్రువు కూడా. కానీ.. జీవించడం కంటే... చనిపోవడమే బెటర్ అని నువ్వు భావించే రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేకపోయాను. అది నన్ను పూర్తిగా కలచివేసింది.  నువ్వు నిన్ను ప్రేమించిన వాళ్లను దూరం చేసుకోకుండా ఉంటే బాగుండేది. నీలోని గాయాన్ని నేను నయం చేయాల్సింది. కానీ చేయలేకపోయాను. నీతో పాటే  నా హృదయంలోని ఓ భాగం వెళ్లిపోయింది.’’ అంటూ ఎమోషనల్ పోస్టు చేశారు. దానితోపాటు సుశాంత్ తో గతంలో తాను కలిసి దిగిన ఫోటోలను ఆమె షేర్ చేశారు.

కాగా.. ఆమె పోస్టుకి నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు. నీ గుండెల్లో ఇంత బాధ ఉందా అంటూ కామెంట్స్ చేశారు. ధైర్యంగా ఉండమంటూ సలహాలు ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?